అప్పు చేసి పప్పుకూడు! | - | Sakshi
Sakshi News home page

అప్పు చేసి పప్పుకూడు!

Sep 23 2026 1:37 AM | Updated on Sep 23 2026 1:37 AM

సాక్షి ప్రతినిధి, కడప : హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హెచ్‌ఏఎం) ప్రాజెక్టు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయనుందా? ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌ డెవలప్‌మెంట్‌ ఫీజులు ఆదాయం ఎస్క్రో అకౌంట్‌కు జమ కానుందా? అంటే ఔననే పరిశీలకులు వెల్లడిస్తున్నారు. జీఓ ఆర్టీ నంబర్‌ 1067తో స్థానిక సంస్థల స్వయం ప్రతిపత్తిపై దెబ్బ పడనుంది. లభించే ఆదాయం మున్సిపాలిటీలతో నిమిత్తం లేకుండా నేరుగా నిర్ణయించిన అకౌంట్‌కు జమ కానుంది. తద్వారా హెచ్‌ఏఎం ద్వారా చేపట్టిన పనుల చెల్లింపులకు చేరునుందని నిపుణులు వివరిస్తూనే, అప్పు చేసి పప్పు కూడు పెట్టడం ఎంత వరకూ శ్రేయస్కరమని నిలదీస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్‌్‌ యాన్యుటీ మోడల్‌ ద్వారా చేపట్టే పనుల కోసం జీఓ ఆర్టీ నంబర్‌ 1067 విడుదల చేసింది. ఆ మేరకు ప్రొద్దుటూరు (రూ.40కోట్లు), పులివెందుల (రూ.20 కోట్లు) మున్సిపాలిటీల్లో వివిధ పనులు చేపట్టేందుకు సీఎం చంద్రబాబు పర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ జీఓ ప్రధానంగా స్థానిక సంస్థల స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేయనుందని, ఎస్క్రో అకౌంట్‌ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు వాపోతున్నారు. మున్సిపాలిటీలకు స్థానికంగా వచ్చే కీలక ఆదాయమైనా ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌, డెవలప్‌మెంట్‌ ఫీజులు, ఎంఐజీ/ఎల్‌ఐజీ లేఅవుట్ల సొమ్మును నేరుగా ‘ఎస్క్రో అకౌంట్‌‘కు మళ్లించాలని ఆ జీవో స్పష్టం చేస్తోందని వివరిస్తున్నారు. దీంతో మున్సిపాలిటీ గల్లా పెట్టాలో పైసల్‌ ఉండే పరిస్థితి ఉండదు. చిన్న చిన్న రోడ్ల మరమ్మతులు, తాగునీరు, పారిశుధ్యం లేదా అత్యవసర పనులకు కూడా నిధుల కొరత ఏర్పడి, మున్సిపాలిటీలు పూర్తిగా నిధుల రహితంగా మారే ప్రమాదం ఉందని పలువురు వాపోతున్నారు.

మున్సిపాలిటీలు నిర్వీర్యం?!

రోడ్లు, డ్రైన్లు, పార్కులు, స్ట్రీట్‌ లైట్లు, సెంట్రల్‌ మీడియన్లు వంటి మౌలిక వసతుల అభివృద్ధి పట్టణాలకు అవసరమే. వాటి కోసం రూపొందించిన ఆర్థిక నమూనా వల్ల భవిష్యత్తులో స్థానిక సంస్థలపై పడే బాధ్యతలు కూడా ప్రజలకు పారదర్శకంగా ఉండాలి కదా? అనే ప్రశ్నను పలువురు లేవనెత్తుతున్నారు. స్థానిక సంస్థల ఆదాయంలో ప్రధాన భాగం దీర్ఘకాలిక చెల్లింపులకు కేటాయించాల్సి వస్తే, భవిష్యత్తులో మున్సిపాలిటీ మనుగడ ఏమిటని పలువురు నిలదీస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి వివిధ పన్నుల రూపంలో రూ.2 కోట్ల ఆదాయం ఉంది. అందులో రూ.1.20 కోట్లు శానిటేషన్‌, అవుట్‌ సోర్సింగ్‌, సులబ్‌ కాంప్లెక్స్‌ వర్కర్ల జీతాలకు చెల్లించాల్సి ఉంది. మరో రూ.50 లక్షల పవర్‌ బిల్లులకు, ఇంకో రూ.72 లక్షలు అమృత్‌ స్కీమ్‌కు చెందిన బ్యాంకు కంతుకు చెల్లిస్తున్నారు. మరో రూ.10 లక్షల డీజిల్‌ బిల్లులు ఇలా సుమారు రూ.2.5 కోట్లు మున్సిపాలిటీకి ఖర్చు రానుంది. అంటే ఆదాయం కంటే ఖర్చు రూ.50 లక్షలు అదనంగా భరిస్తున్నారు. ఇకపై లభించే ఆదాయం ఎస్క్రో అకౌంట్‌కు జమ అయితే రెగ్యులర్‌ చెల్లింపుల పరిస్థితి ఏమిటని పలువురు నిలదీస్తున్నారు.

ఇదీ చంద్రబాబు ప్రభుత్వం తీరు

మున్సిపల్‌ ఎన్నికల కోసం జిమ్మిక్కులు

ప్రొద్దుటూరులో ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ

రూ.40 కోట్లతో వివిధ పనుల నిర్మాణానికి శ్రీకారం

ఆ మొత్తం కోసం మునిసిపాలిటీ ఆదాయం ఎస్క్రో అకౌంట్‌కు మళ్లింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement