టౌన్‌ బ్యాంక్‌లో డీసీఓ విచారణ | - | Sakshi
Sakshi News home page

టౌన్‌ బ్యాంక్‌లో డీసీఓ విచారణ

Sep 23 2026 1:37 AM | Updated on Sep 23 2026 1:37 AM

ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు టౌన్‌ బ్యాంక్‌లో చోటు చేసుకున్న అవకతవకల ఆరోపణలపై జిల్లా కోఆపరేటివ్‌ ఆఫీసర్‌ వెంకటసుబ్బయ్య మంగళవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బ్యాంక్‌ సీఈఓ నిరంజన్‌రెడ్డిని విచారణ చేశారు. బ్యాంక్‌ రికార్డులు, ఖాతాదారుల సమాచారం ఎలా బయటికి వెళుతోందని అడిగి తెలుసుకున్నారు. బ్యాంక్‌కు సంబంధించిన సీసీ ఫుటేజీ సమాచారంపై నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, సంబంధం లేని వారికి పాస్‌వర్డ్‌ ఇవ్వొద్దని తెలిపారు. జరిగిన అవకతవకలను క్షుణ్ణంగా పరిశీలించి పోలీసు కేసు నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట ప్రొద్దుటూరు డివిజన్‌ కోఆపరేటివ్‌ ఆఫీసర్‌ సత్యానందం, విచారణ అధికారి చెన్నకృష్ణారెడ్డి ఉన్నారు.

కూలి చెల్లింపుపై ఘర్షణ

ముద్దనూరు : స్థానిక ఎస్సీ కాలనీలో పెయింటింగ్‌ కూలి డబ్బులు చెల్లింపు విషయమై ఘర్షణ పడటంతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. హెడ్‌కానిస్టేబుల్‌ త్రివేది సమాచారం మేరకు.. ఈ నెల 19వ తేదీన ఎస్సీ కాలనీలో లక్ష్మీనరసింహులుకు రూ.2500 కూలి డబ్బులు చెల్లించపోవడంతో ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో సుధాకర్‌ మరో ఇద్దరు.. నరసింహులుపై దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అదనపు కట్నం కోసం

వేధింపులు

ముద్దనూరు : అదనపు కట్నం తేవాలని భార్యను వేధిస్తున్నాడని అరుణ్‌పై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. హెడ్‌కానిస్టేబుల్‌ త్రివేది సమాచారం మేరకు.. మండలంలోని నల్లబల్లె గ్రామానికి చెందిన అరుణ్‌కు సాయి దుర్గ అనే మహిళతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. గత కొంత కాలం నుంచి అరుణ్‌ అతని భార్య దుర్గను అదనపు కట్నం తేవాలని శారీరంగా, మానసికంగా వేధిస్తున్నాడు. భార్యపై దాడి చేయడంతో ఆమెకు గాయాలవడంతో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు అరుణ్‌, అతని అవ్వపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement