ఢీకొట్టి.. కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

ఢీకొట్టి.. కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లి..

Sep 23 2026 1:37 AM | Updated on Sep 23 2026 1:37 AM

మైదుకూరు : రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి కిలోమీటర్‌ దూరం ఈడ్చుకెళ్లింది. తీవ్ర రక్తగాయాలతో ఉన్న ఆ వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన సంఘటన మైదుకూరు మండలం వనిపెంటలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వనిపెంటలోని వడ్డెర కాలనీకి చెందిన ముద్దం నాగరాజు(50) అనే వ్యక్తి సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మెయిన్‌ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. మైదుకూరు వైపు నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం అటవీ చెక్‌ పోస్టుకు సమీపంలో అతన్ని ఢీకొట్టింది. డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో నాగరాజు శరీరాన్ని కిలోమీటర్‌ దూరంలోని దర్గా వరకు ఈడ్చుకెళ్లింది. అక్కడ తీవ్ర రక్తగాయాలతో రోడ్డు పక్కన పడిపోయిన అతన్ని 108 అంబులెన్స్‌లో చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. రాత్రి 1 గంట సమయంలో నాగరాజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాగరాజు భార్య మహేశ్వరి పదేళ్ల కిందట ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. వారికి ఓ కుమార్తె, కుమారుడు ఉండగా వారిని అమ్మమ్మ ఆదిలక్ష్మి బ్రహ్మంగారిమఠం తీసుకెళ్లి పెంచుకుంటోంది. భార్య మృతి చెందినప్పటి నుంచి నాగరాజు ఒంటరిగా ఉంటున్నాడు. కుమార్తె నాగకళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అర్బన్‌ ఎస్‌ఐ కత్తి వెంకటరమణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నారు.

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం

చాపాడు : మండల పరిధి గుంతచీపాడులోని జి.మహేశ్వర్‌రెడ్డి ఇంటిలో సోమవారం రాత్రి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంటిలోని టీవీ, ఫ్రిడ్జ్‌, సోఫాలతోపాటు ఇంటిలోని సామగ్రి మొత్తం కాలిపోయింది. బీరువాలో ఉన్న రూ.10 లక్షల నగదు కూడా కాలిపోయిందని బాధితుడు తెలిపాడు. గత రెండు నెలల క్రితం కూడా ఇదే ఇంటిలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిందని బాధితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. నగదుతోపాటు సామగ్రి కలిపి రూ.25 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు బాధితులు తెలిపారు. చదువుకునే పిల్లల ఫీజులకు, తన తండ్రి మోకాళ్ల ఆపరేషన్‌ కోసం డబ్బులు ఇంట్లో పెట్టుకున్నామని బాధితుడు తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

రూ.25 లక్షల వరకు నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement