పులివెందుల మున్సిపాలిటీకి నిధులు మంజూరు | - | Sakshi
Sakshi News home page

పులివెందుల మున్సిపాలిటీకి నిధులు మంజూరు

Sep 23 2026 1:43 AM | Updated on Sep 23 2026 1:43 AM

పులివెందుల టౌన్‌ : హైబ్రిడ్‌ అన్యుటీ మోడల్‌ ప్రాజెక్టు ద్వారా పులివెందుల మున్సిపాలిటీకి రూ.20కోట్లు మంజూరయ్యాయని కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి తెలిపారు. మంగళవారం పట్టణంలోని స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ హాలులో మున్సిపల్‌ కమిషనర్‌ శివ తనూజ అధ్యక్షతన హైబ్రిడ్‌ అన్యుటీ మోడల్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి మాట్లాడుతూ హెచ్‌ఏఎం ప్రాజెక్టు ద్వారా ప్రజలకు తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధిలైట్లు, తదితర మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా వివిధ అభివృద్ధి పనుల ద్వారా నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. మున్సిపల్‌ స్పెషలాఫీసర్‌ చిన్నయ్య, తహసీల్దార్‌ నజీర్‌ అహమ్మద్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అవకాడో తోట సందర్శన

లింగాల : మండలంలోని వెలిదండ్ల గ్రామంలోని రైతు వరదారెడ్డి సాగు చేసిన అవకాడో పంటను మంగళవారం కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అవకాడో మొక్కల ఎదుగుదల, సాగు విధానం తదితర అంశాలను పరిశీలించారు. అవకాడో సాగులో అనుసరిస్తున్న పద్ధతులు, అందుబాటులో ఉన్న రకాలు, మొక్కల వివరాలు, సాగులో ఎదురవుతున్న సవాళ్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అవకాడో సాగులో విజయవంతమైన రైతు వరదారెడ్డిని అభినందించారు. వరదారెడ్డి తోటలోని నాణ్యమైన మదర్‌ ప్లాంట్ల నుంచి మంచి రకాలను ఎంపిక చేసి నర్సరీని అభివృద్ధి చేయాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా జిల్లా ఉద్యాన అధికారి హరిప్రసాద్‌, జిల్లా వ్యవసాయాధికారి సుబ్రహ్మణేశ్వరరావు, ఏడీఏ ప్రభాకర్‌రెడ్డి, హెచ్‌ఓ దీప, ఏఓ రమేష్‌, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

స్మార్ట్‌ కిచెన్లు నూతన అధ్యాయం..

పులివెందుల టౌన్‌ : ప్రతి విద్యార్థికి నాణ్యమైన, పరిశుభ్రమైన, వేడివేడి భోజనం అందించడమే లక్ష్యంగా జిల్లాలో అమలు చేస్తున్న సెంట్రలైజ్డ్‌ స్మార్ట్‌ కిచెన్‌ వ్యవస్థ మధ్యాహ్న భోజన పథకంలో గుణాత్మక మార్పునకు నాంది పలుకుతోందని కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి అన్నారు. మంగళవారం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ మున్సిపల్‌ పాఠశాలలో సెంట్రలైజ్డ్‌ స్మార్ట్‌ కిచెన్‌ వ్యవస్థ నిర్వహణ, అమలు తీరును పరిశీలించారు. ఎంఈఓలు, మధ్యాహ్న భోజన పథక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement