టీడీపీ మాజీ కౌన్సిలర్‌పై దంపతుల దాడి | - | Sakshi
Sakshi News home page

టీడీపీ మాజీ కౌన్సిలర్‌పై దంపతుల దాడి

Sep 23 2026 1:37 AM | Updated on Sep 23 2026 1:37 AM

ప్రొద్దుటూరు : స్థానిక మూడో వార్డుకు చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్‌ జంబాపురం రామాంజనేయరెడ్డిపై దంపతులు శోభారాణి, వంశీ మంగళవారం సాయంత్రం దాడి చేశారు. అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్‌ వార్డు పరిధిలో రామ్‌నగర్‌ వద్ద రోడ్డు ప్యాచ్‌ వర్క్‌ పనులను కాంట్రాక్టర్‌ చిరంజీవి చేపడుతున్నారు. పనుల నిర్వహణ ప్రదేశంలో ఎలాంటి సూచికలు లేకపోవడంతో దంపతులు ఇద్దరూ ద్విచక్రవాహనంలో ముందుకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న మాజీ కౌన్సిలర్‌ జంబాబాపురం రామాంజనేయరెడ్డి రోడ్డు వేస్తున్నది కళ్లు కనిపించడం లేదా అని దంపతులిరువురిని దూషించాడు. వెంటనే వారు నోరు అదుపులో పెట్టుకో అని వాగ్వాదం చేసి మాజీ కౌన్సిలర్‌పై దాడి చేశారు. ఈ సందర్భంగా వారు మాజీ కౌన్సిలర్‌పై చెప్పు విసిరివేశారు. దాడిలో మాజీ కౌన్సిలర్‌ చొక్కా కూడా చినిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రామాంజనేయరెడ్డి సతీమణి సంఘటన స్థలానికి పరుగులు తీసుకుంటూ వచ్చింది. అయినా వారు వెనక్కు తగ్గలేదు. తప్పు మీది పెట్టుకుని మమ్మల్ని మాట్లాడితే ఎలా అని వాగ్వాదానికి దిగారు. తనపై జరిగిన దాడిని అవమానంగా భావించిన మాజీ కౌన్సిలర్‌ త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు సర్దిచెప్పారు. కేసు నమోదు చేయకుంటే తాను ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి దగ్గరికి వెళుతానని మాజీ కౌన్సిలర్‌ బెదిరించినట్లు తెలిసింది.

దూషించడంతోనే ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement