కడప ఎడ్యుకేషన్: కడప వైఎస్సార్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఇండియా ఓపెన్ ప్రైజ్ మనీ చెస్ పోటీలలో కడప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మేడ సుబ్బు దివ్యాంగుల విభాగంలో ప్రతిభ చాటి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా విజేత సుబ్బుకు నిర్వాహకులు రూ.2,000 నగదు బహుమతితో పాటు మెడల్, సర్టిఫికెట్ అందజేశారు. విద్యార్థి సుబ్బును పాఠశాల ప్రధానోపాధ్యాయులు తుపాకుల మురళి, ఉపాధ్యాయులు సోమవారం పాఠశాలలో అభినందించారు. సుబ్బు భవిష్యత్తులో మరెన్నో అవార్డులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరసింహులు, వేపరాల ఇమ్మానుయేల్ ఎబినేజర్ వెంకటరమణ, సరస్వతి, ఆకుల రాజా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


