‘రాగి’ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

‘రాగి’ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

కడప అర్బన్‌ : కడప నగరంలోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ఐఓసీఎల్‌ ఎదురుగా ఉన్న తమ స్టాక్‌ పాయింట్‌లో స్క్రాబ్‌ రాగి మెటీరియల్‌ను దొంగలించుకుని వెళ్లినట్లు మూల సురేంద్ర ఈనెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ రాజగోపాల్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం కడప నగరం చలమారెడ్డిపల్లి సమీపంలోని కాశినాయన గుడి వద్ద షేక్‌ పీరును అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి రూ.2 లక్షల విలువైన రాగి మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేయడంలో కృషి చేసిన ఎస్‌ఐలు లక్ష్మీనారాయణ, చంద్రమోహన్‌, సిబ్బందిని సీఐ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement