అబద్ధాల పుట్ట రాంగోపాల్‌ రెడ్డి | - | Sakshi
Sakshi News home page

అబద్ధాల పుట్ట రాంగోపాల్‌ రెడ్డి

Sep 13 2026 7:40 AM | Updated on Sep 13 2026 7:40 AM

పులివెందుల: టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి చంద్రబాబు, లోకేష్‌ల డైరెక్షన్‌లో స్క్రిప్ట్‌లు చదువుతూ అబద్ధాల పుట్టలా మారిపోయారని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర రవికుమార్‌ మండిపడ్డారు. శనివారం పులివెందులలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెగా డీఎస్సీ పేరుతో ఆర్భాటం చేసి, నేడు కోర్టు కేసులు, వాయిదాల పేరుతో కాలయాపన చేస్తూ లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఈ కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్నారు. ’జాబ్‌ రావాలంటే బాబు రావాలి’ అన్న నినాదం కాస్తా, నేడు ‘బాబు వచ్చాడు.. ఉన్న ఉద్యోగాలు ఊడాయి’ అనేలా మారిందని ఎద్దేవా చేశారు. ఐటీ, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా నారా లోకేష్‌ పూర్తిగా విఫలమయ్యారని, ఏటా ఇచ్చే జాబ్‌ క్యాలెండర్‌, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఇప్పటికై నా ఎమ్మెల్సీ నోటి దురుసుతనాన్ని అదుపులో పెట్టుకోవాలని, ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగుల హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో నాయకులు దేవదత్త రాజా నాయుడు, రమేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement