నందలూరు : మండలంలోని ఎంఎం పురం పంచాయతీ వెంకటరాజంపేట గ్రామానికి చెందిన చింతకాయల వెంకటరత్నం(40) విద్యుత్ వైరు పట్టుకొని మంగళవారం ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపిన మేరకు వివరాలు... పెంచలయ్య కుమారుడు వెంకటరత్నం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాడు. కొంత కాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. భార్య కువైట్‌లో ఉండగా, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు తనకు దూరంగా ఉండటంతో జీవితంపై విరక్తి చెంది విద్యుత్ మెయిన్ లైన్ వైరు పట్టుకోవడంతో షాక్‌కు గురై మృతి చెందాడు. మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కుటుంబానికి దూరమై.. జీవితంపై విరక్తితో..


