● అధికార వేడుకల్లో..విమర్శల విందు | - | Sakshi
Sakshi News home page

● అధికార వేడుకల్లో..విమర్శల విందు

Sep 9 2026 3:10 AM | Updated on Sep 9 2026 3:10 AM

సాధారణంగా మున్సిపల్‌ కమిషనర్లు అంటే నగరంలో ఎక్కడ డ్రైనేజీ బాగుంది, ఎక్కడ వాటర్‌ పైప్‌లైన్‌ లీకవుతోంది అంటూ ఫైళ్లతో కుస్తీ పడుతుంటారు. కానీ, మన కడప మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ పి.భవానీప్రసాద్‌ గారి స్టైలే వేరు! మంగళవారం నగరంలో ఒక ఆసక్తికరమైన ‘రాజకీయ విన్యాసం’ చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ జోనల్‌ ఇన్‌ఛార్జ్‌ ఆర్‌.శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. ఆ పార్టీ నేత పాలెంపల్లె సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గండి వాటర్‌ వర్క్స్‌ వేదికగా తమ్ముళ్లకు గట్టిగా విందు, అన్నదానాలు అరేంజ్‌ చేశారు. ఇంకేముంది.. రాజకీయ వేడుక కదా అని అధికారులు దూరంగా ఉంటారనుకుంటే పొరపాటే! మున్సిపల్‌ బాస్‌ భవానీప్రసాద్‌ గారు స్వయంగా విచ్చేశారు. చేతికి గరిటె పట్టి, ఆకుల్లోకి వేడివేడి అన్నాన్ని వడ్డిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించడం చూసి అక్కడున్న వారు ముక్కున వేలేసుకున్నారు. ఒక నగర పాలక సంస్థకు సర్వాధికారిగా ఉంటూ, ఒక రాజకీయ పార్టీకి చెందిన పూర్తి ప్రైవేట్‌ కార్యక్రమంలో ఇలా భుజాలు కలుపుతూ ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు కడప రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కమిషనర్‌ గారి వడ్డన చూస్తుంటే.. నగర సేవలో కంటే కూటమి సేవలోనే అసలైన కిక్కు ఉందన్నట్లుంది అంటూ వ్యంగ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి! – కడప కార్పొరేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement