కాలిబాటపై శీతకన్నప్పా! | - | Sakshi
Sakshi News home page

కాలిబాటపై శీతకన్నప్పా!

Sep 9 2026 3:10 AM | Updated on Sep 9 2026 3:10 AM

శ్రీకాళహస్తి దేవస్థానం తోడ్పడాలి కాలిబాటపై సర్వే నిర్వహించాలి

దేవదాయశాఖ, శ్రీకాళహస్తి

నిర్లక్ష్యంపై భక్తుల విమర్శలు

రాజంపేట ఊటుకూరు నుంచి

శ్రీకాళహస్తికి నేరుగా చారిత్రక మార్గం

అభివృద్ధికి డిమాండ్‌

ఇతరరాష్ట్రాల భక్తులకు

తప్పనున్న ప్రయాణ దూరం

రాజంపేట: అపర శివభక్తుడైన భక్తకన్నప్ప (తిన్నడు) జన్మస్థలి నుంచి ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తికి వెళ్లిన కాలిబాట ఏది అన్నది ఇప్పుడు శివభక్తులలో ఆసక్తికర చర్చగా మారింది. తమిళనాడుకు చెందిన ఒక భక్తుడు ‘పెరియపురాణం’ ద్వారా భక్తకన్నప్ప జన్మస్థలం వైఎస్సార్‌ జిల్లాలోని రాజంపేట మండలం ఊటుకూరు అని వెలుగులోకి తెచ్చా రు. కన్నప్ప జన్మస్థలానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక గుర్తింపు తీసుకురావడంలో పాలకులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్షేత్రం అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం, దేవదాయశాఖతో పాటు శ్రీకాళహస్తి దేవస్థానం కూడా శీతకన్ను వేశాయని భక్తులు పెదవి విరుస్తున్నారు.

ఉడుము కొండల మీదుగా పయనం

కన్నప్ప నాడు ఊటుకూరు గ్రామానికి తూర్పు వైపున ఉన్న దట్టమైన అడవులు, వాగులు, ఉడుము కొండల మీదుగా పయనించి శ్రీకాళహాస్తి సమీపంలోని దివ్య కై లాస శిఖరారణ్యానికి చేరుకున్నట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ప్రాచీన అటవీ మార్గాన్ని నేటి రహదారులతో యథాతథంగా పోల్చడానికి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ, దీనిపై రాష్ట్ర దేవదాయశాఖ అధికారికంగా సర్వే చేయిస్తే నేరుగా శ్రీకాళహస్తికి ఒక అద్భుతమైన మార్గం ఏర్పడుతుందని జన్మస్థలి వాసులు కోరుతున్నారు.

రేణిగుంటకు వెళ్లకుండానే..

ఈ చారిత్రక కాలిబాటను వెలుగులోకి తెచ్చి, రహదారిగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే దక్షిణ భారతదేశంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే భక్తులు రేణిగుంట మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదు. రాజంపేట మండలం ఊటుకూరు నుంచే నేరుగా శ్రీకాళహస్తికి ప్రయాణం ఎంతో సుగమమవుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కన్నప్ప జన్మస్థలాన్ని గుర్తించి, కాలిబాటపై సమగ్ర సర్వే జరపాలని శివభక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

భక్తకన్నప్ప జన్మస్థలి అభివృద్ధికి శ్రీకాళహస్తి దేవస్థానం పూర్తిస్థాయిలో దోహదపడాలి. కన్నప్ప ఊటుకూరు (ఊడుమూరు) నుంచి ఉడుముకొండల మీదుగా తూర్పు దిక్కుగా శ్రీకాళహస్తి ప్రాంతానికి అరణ్యంలో వేటాడుకుంటూ వెళ్లాడని ఇక్కడి చరిత్ర చెబుతోంది. దేవదాయశాఖ భక్తకన్నప్ప కాలిబాటను గుర్తించి అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ ఆలయాన్ని శ్రీకాళహస్తి పరిధిలోకి తెస్తే మరిన్ని నిధులు వచ్చి భక్తులకు సౌకర్యాలు మెరుగవుతాయి. – నాగా ఫృథ్వీపరెడ్డి,

వైఎస్సార్‌సీపీనేత, ఊటుకూరు, రాజంపేట

అపర శివభక్తుడు భక్తకన్నప్ప కాలిబాటపై ప్రభుత్వం వెంటనే అధికారిక సర్వే నిర్వహించాలి. స్థానిక ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ శ్రీకాళహస్తి దేవస్థానంలోకి విలీనం చేయాలి. అప్పుడే ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం భ క్తులే చొరవ తీసుకుని ఆలయ అభివృద్ధికి కృషి చే స్తున్నారు. అలాగే భక్తకన్నప్ప జయంతి ఉత్సవాలను ఊటుకూరులో ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలి. – రేవరాజు శ్రీనివాసరాజు,

మాజీ ఎంపీటీసీ, ఊటుకూరు, రాజంపేట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement