ఉన్నత ఆలోచనలు.. ఉజ్వల భవితకు బాటలు | - | Sakshi
Sakshi News home page

ఉన్నత ఆలోచనలు.. ఉజ్వల భవితకు బాటలు

Aug 25 2026 1:51 AM | Updated on Aug 25 2026 1:51 AM

బీసీసీపీఎల్‌ సీఎంఓ రామమూర్తి

ఘనంగా స్నాతకోత్సవం

కమలాపురం : ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది.. సరైన స్థాయిలో వినియోగిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీసీపీఎల్‌) సీఎంఓ రామమూర్తి తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఆలోచించాలని, అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. స్థానిక ఆర్‌సీఎం ఆసుపత్రి ప్రాంగణంలో శ్రీభారతి సిమెంట్స్‌శ్రీ సీఎస్‌ఆర్‌ నిధులతో నిర్వహిస్తున్న మేక్‌ ఇండియా స్నాతకోత్సవానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజల్వన చేశారు. అనంతరం మాట్లాడుతూ భారతి సిమెంట్‌ కేవలం వ్యాపార ధోరణిలో మాత్రమే కాకుండా సామాజిక సేవలో కూడా ముందు వరుసలో ఉందన్నారు. గత ఆరేడేళ్లుగా సిమెంట్‌ ధరలు పతనమవుతున్నా.. భారతి సిమెంట్‌ మాత్రం కోట్లు వెచ్చించి సామాజిక సేవ చేస్తోందని కొనియాడారు. 2022 నుంచి డ్రాపౌట్స్‌ను గుర్తించి ట్రిపుల్‌ హెచ్‌ పర్యవేక్షణలో వారికి వివిధ అంశాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై శిక్షణనిచ్చి ఉపాధి చూపించడం హర్షణీయం అన్నారు. ఒక్కో విద్యార్థిపై దాదాపు రూ.40 వేలు ఖర్చు చేసి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చి హుందాయ్‌ తదితర ప్రముఖ కంపెనీలలో ఉపాధి పొందేలా తర్ఫీదు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులు దాదాపు 12–16 వేల వరకు వేతనం పొందుతూ తల్లిదండ్రులకు బాసటగా నిలవడం ప్రశంసనీయం అన్నారు. ఈ ఏడాది 52 మంది శిక్షణకు నమోదు చేసుకోగా 46 మందికి వివిధ కంపెనీల్లో ఉపాధి లభించడం చూస్తే.. భారతి సిమెంట్స్‌ ప్రజల పట్ల ఎంత సేవ చేస్తుందో అర్థం అవుతుందన్నారు. డీజీఎం పరమేశ్వర్‌, సీఎస్‌ఆర్‌ హెడ్‌ నితేశ్వర్‌, చీఫ్‌ మేనేజర్‌ భార్గవ్‌రెడ్డి మాట్లాడుతూ పదో తరగతి, ఇంటర్‌ చదివి వివిధ కారణాలతో చదువు మానేసిన డ్రాపౌట్స్‌ను గుర్తించి వారికి ఆరునెలల పాటు శిక్షణ ఇచ్చి రాష్ట్ర స్థాయిలో పోటీ పడేలా చేయడం గర్వకారణమన్నారు. తమ పరిశ్రమ విద్య, వైద్యంపై ఎక్కువ దృష్టి పెట్టిందని, డ్రాపౌట్స్‌కు స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై శిక్షణ ఇచ్చి తమ కాళ్లపై నిలిచేలా చేయడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. మొదట 30 మందితో ఈ కార్యక్రమం ప్రారంభించామని, 2022 నుంచి ఇప్పటి వరకు దాదాపు 300 మందికి ఉపాధి కల్పించామని, వారంతా ప్రస్తుతం పెద్ద కంపెనీల్లో పని చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్‌ హెచ్‌ ట్రైనర్స్‌ జయరాజ్‌, హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందిస్తున్న భారతి ప్రతినిధులు, శిక్షణ పొందిన డ్రాపౌట్స్‌ విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement