న్యూస్‌రీల్
అలరించిన
సాంస్కృతిక కార్యక్రమాలు
● ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
● అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
● జిల్లా కేంద్రంలో ఉత్సవాల్లో పాల్గొన్న
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
వాతావరణం
జిల్లాలో శనివారం 27.2 – 36.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గంటకు 9.3 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
– కడప అగ్రికల్చర్.
మహనీయుల త్యాగం.. నేటి తరానికి ఆదర్శనీయం
– 8లో
ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026
కడప సెవెన్ రోడ్స్ : స్వాతంత్య దినోత్సవ వేడుకలు శనివారం వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. కడప పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. దేశభక్తి గీతాలతో విద్యార్థులు చేసిన నృత్యప్రదర్శలు అలరించాయి. జిల్లా అభివృద్ధిని వివరించేలా శకటాల ప్రదర్శన నిర్వహించారు.
పెట్టుబడుల గమ్యస్థానంగా కడప
అనంతరం మంత్రి మాట్లాడుతూ పెట్టుబడుల గమ్యస్థానంగా కడపను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. పెట్టుబడిదారులకు ప్రోత్సాహకం అందించేందుకు ‘ఇన్‌వెస్ట్ కడప’ అనే జిల్లా పెట్టుబడి సౌలభ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, త్వరలోనే ఇది నిర్వహణలోకి రానుందన్నారు. శనివారం కడప పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రానున్న ఐదేళ్లలో రూ.25వేల కోట్ల పెట్టుబడులను సులభతరం చేయడం ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం ఇన్‌వెస్ట్ కడప ప్రధాన లక్ష్యమని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పారిశ్రామిక పెట్టుబడి కేంద్రంగా కడపను నిలబెట్టడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. పెట్టుబడిదారులకు ఒకేచోట అన్ని సేవలు అందేలా ఇన్‌వెస్ట్ కడపను అభివృద్ధి చేస్తామన్నారు. నైట్ ల్యాండింగ్ సౌకర్యం ఉన్న విమానాశ్రయం, ముంబై– కన్యాకుమారి రైలు మార్గం, జాతీయ రహదారులు రవాణా పరంగా అనుకూలతలు కల్పిస్తున్నాయన్నారు. కృష్ణపట్నం, చైన్నె ఓడరేవులు సమీపంలోనే ఉన్నాయన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్టప్ రావాలన్న ఉద్దేశంతో దేశంలోనే ప్రథమంగా కడపలో స్టార్టప్ కడపను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. దీని ద్వారా ప్రతి ఏటా 50 నుంచి 100 స్టార్టప్‌లను అభివృద్ధి చేసి 500లకుపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించడం, రూ.500కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యాలుగా నిర్దేశించుకున్నామన్నారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో పరిశ్రమలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.50లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని తెలిపారు. ఈ మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో 6,292 ఎకరాలలో రూ.2,750.76కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాండ్లపల్లె వద్ద రూ.2వేల కోట్లతో ఏర్పాటు కానున్న జేఎస్‌డబ్ల్యు నియో ఎనర్జీ ప్లాంటు ద్వారా 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితోపాటు 1380మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని వెల్లడించారు.
గాలేరు నగరి ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టు అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. జీఎన్‌ఎస్‌ఎస్ ప్యాకేజీ పనులను వేగవంతం చేసి 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. ఎన్‌టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టు పరిధిలో 84వేల ఎకరాలకు సాగునీరు అందించే చర్యలు చేపట్టామన్నారు. కుందూ నది నుంచి 8టీఎంసీల నీటిని ఎత్తిపోసి 1.93లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నట్లు తెలిపారు. మైదుకూరు మండలంలోని ముదిరెడ్డిపల్లె, తిప్పిరెడ్డిపల్లె చెరువులలో తెలుగు గంగ కాలువ ద్వారా నింపేందుకు రూ.8.90కోట్లతో చేపట్టిన పనులకు పరిపాలనా, సాంకేతిక అనుమతులు పూర్తి చేశామన్నారు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు లక్ష కోట్ల విలువైన పెట్టుబడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నామన్నారు. లింగాల మండలం అరటి పంట ద్వారా జిల్లాతోపాటు రాష్ట్ర స్థూల విలువ ఆధారిత ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రైతులు సాగు చేస్తున్న ఈ అరటికి దేశీయ, విదేశీ మార్కెట్లలో అధిక ఆదాయం వచ్చేలా మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు. ప్రొద్దుటూరు నుంచి ఆర్టీపీపీని కలుపుతూ, పులివెందుల నుంచి అద్దాలమర్రి హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు, కమలాపురం ఆర్‌ఓబీ పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. కడప నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.906కోట్లతో పనులకు శ్రీకారం చుట్టామన్నారు. అమృత్ 2.0 పథకం కింద బ్రహ్మం సాగర్ నుంచి కడప నగరానికి శాశ్వత తాగునీటి సరఫరా కోసం రూ.592కోట్లతో చేపట్టిన పనులు కొనసాగుతున్నాయన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.38కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
ఉత్తమ సేవలకు సర్టిఫికెట్ల ప్రదానం :
వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 413మంది అధికారులు, ఉద్యోగ సిబ్బంది, ఎన్‌జీవోలు, బ్యాంకర్లు, తదితరులు చూపిన ఉత్తమ ప్రతిభను గుర్తించి మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి మెరిట్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.
రూ.945 కోట్ల ఆస్తుల పంపిణీ
అనంతరం మంత్రి జనార్థన్‌రెడ్డి వివిధ ప్రభుత్వ శాఖలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా 92,721 మంది లబ్ధిదారులకు రూ.945కోట్ల విలువ చేసే ఆస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్‌శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి పాల్గొన్నారు.
పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి.
కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ షెల్యే నచికేత్ విశ్వనాథ్
అగ్నిమాపక
సిబ్బంది ప్రదర్శన
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
పరేడ్‌ను పరిశీలిస్తున్న మంత్రి
హాజరైన అధికారులు, ప్రజలు
తొండూరుకు చెందిన మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల బీసీ సంక్షేమ వసతి గృహం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం, అలాగే కడప ట్రైబ ల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు, సీకే దిన్నె ఏడిఫై, కడప ముద్ర డ్యాన్స్ అకాడమి, అట్టూరు కేజీబీవీ, ఖాజీపేట కేజీబీవీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కడప కార్పొరేషన్: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు ఇచ్చిన అవార్డులను ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది తిరస్కరించారు. వీరు అవార్డులు తిరస్కరించడానికి అడిషనల్ కమిషనరే కారణమని తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. కడప కార్పొరేషన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం రోజు 44 మందికి అవార్డులు ఇచ్చారు. వీరిలో ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన వారు 7 మంది, ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్ నలుగురు, యూపీఏ సెక్షన్ ఇద్దరు, పబ్లిక్ హెల్త్ విభాగం 9 మంది, రెవెన్యూ విభాగం ఇద్దరు, టౌన్‌ప్లానింగ్ విభాగం ఇద్దరు, స్వర్ణవార్డుల నుంచి 18 మంది ఉన్నారు. కాగా ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే 28 మందికి అవార్డులు ఇవ్వాలని ఆ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కమిషనర్‌కు సిఫారసు చేశారు. ఇందులో గండి, లింగంపల్లి వాటర్ వర్క్స్‌లో పనిచేసే సిబ్బంది, ఫిట్టర్లు తదితరులు ఉన్నారు. సిబ్బందిని ప్రోత్సహించడానికి సాదారణంగా ఆయా విభాగాలు ఎంతమందిని ప్రతిపాదిస్తే అంతమందికీ అవార్డులు ఇస్తుంటారు. పేర్లు ఎక్కువగా ఉంటే కమిషనర్ వారిలో ఎంతమందికి ఇవ్వాలో నిర్ణయం తీసుకుని వారి పేర్లను ఆ శాఖకు సూచిస్తారు. అయితే అవార్డులు తీసుకోవడానికి రావాలని శుక్రవారం రాత్రి అందరికీ ఫోన్లు చేసి పిలిచిన తర్వాత ఉదయం జాబితాలో కేవలం ఏడుగురి పేర్లే కనిపించడంతో ఇంజినీరింగ్ శాఖ అధికారులు షాక్ అయ్యారు. కమిషనర్‌తో సంబంధం లేకుండానే అడిషనల్ కమిషనర్ వారి పేర్లను తొలగించినట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన సిబ్బంది ఆ అవార్డులను తిరస్కరించారు. ప్రతిదీ తాను చెప్పినట్లు చేయాలనే అడిషనల్ కమిషనర్ వ్యవహార శైలి రాను రాను వివాదంగా మారుతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.


