16న బాలికల రగ్బీ టోర్నమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

16న బాలికల రగ్బీ టోర్నమెంట్‌

Aug 16 2026 5:09 AM | Updated on Aug 16 2026 5:09 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: నగరలోని డాక్టర వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాలలో ఖేలో ఇండియా అండర్‌ –15 బాలికల రగ్బీ టోర్నమెంట్‌ నిర్వహిస్తు న్నట్లు అస్మిత రగ్బీ లీగ్‌ టోర్నీ ఆర్గనైజర్‌ పోలంకి గణేష్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాము ఇచ్చిన లింకులో రిజిస్టర్‌ అయినా వారందరూ పాల్గొన్నవచ్చన్నారు. స్కూల్‌ పిల్లలే కాక అండర్‌–15 బాలికల కేటగిరిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ లింకులో రిజిస్టర్‌ చేసుకొని టోర్నీలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇందుఓ గెలిచిన వారికి పతకాలు ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు మొబైల్‌ 82970 59998 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

దరఖాస్తు గడువు పొడిగింపు

కడప ఎడ్యుకేషన్‌: యోగి వేమన విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం అందించే పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లమా ఇన్‌ పబ్లిక్‌ రిలేషన్‌ (పీజీ డీపీఆర్‌), పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లమా ఇన్‌ తెలుగు జర్నలిజం (పీజీ డీటీజే) కోర్సుల్లో ప్రవేశ దరఖాస్తు గడువును సెప్టెంబర్‌ 11వ తేదీ వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ సంచాలకులు ఆచార్య వి రామకృష్ణ తెలిపారు. ఏడాది కాలంగా ఈ కోర్సుల్లో రెండు సెమిస్టర్‌లు ఉంటాయన్నారు. రెగ్యులర్‌ విధానంలో సాయంత్రం నిర్వహించే ఈ కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థులతో పాటు, జర్నలిజం ప్రొఫెషన్‌లో ఉన్నవారు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు కూడా అర్హులన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయంలోని ప్రవేశాల సంచాలకుల కార్యాలయం లేదా 8008006630, 95420 67303 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

శాస్త్రోక్తంగా

స్నపన తిరుమంజనం

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అర్చకులు మూల విరాట్‌కు పంచామృతాభిషేకం జరిపారు.టీటీడీ ఆలయ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో మూలవిరాట్‌లను సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారిని దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఉరుసు పోస్టర్ల ఆవిష్కరణ

చౌడేపల్లె: అన్నమయ్యజిల్లాదాదేపల్లెలోని హజ్రత్‌ సయ్యద్‌ పీర్‌ మషాయఖ్‌ బహదూర్‌ అలీషా బాబా దర్గాలో ఈనెల16,17,18 తేదీల్లో ఉరుసు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు. శనివారం తిరుపతిలోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి నివాసంలో ఎమ్మెల్యేపాటు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. అంతకుముందు ఉరుసుకు కుటుంబ సమేతంగా రావాలని పెద్దిరెడ్డికి ఆహ్వానపత్రిక అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement