అంజన్న దర్శనం..భక్తుల పరవశం | - | Sakshi
Sakshi News home page

అంజన్న దర్శనం..భక్తుల పరవశం

Aug 16 2026 5:09 AM | Updated on Aug 16 2026 5:09 AM

చక్రాయపేట: శ్రావణ మాసం తొలి శనివారోత్సవం భక్తులతో గండి క్షేత్రం నిండుకుంది. భక్తులు ప్రశాంతంగా క్యూలైన్‌ లో నిలుచుని స్వామివారిని దర్శించుకొని పరవశించి పోయారు.వర్షాలు లేని కారణంగా పాపాఘ్ని నదిలో నీరు లేకపోవడంతో ఆలయ వర్గాలు భక్తుల సౌకర్యార్థం కాలువ తవ్వించడంతో భ అందులో స్నానాలు చేసి దర్శనం చేసుకున్నారు.వేంపల్లె నుంచి పెద్ద ఎత్తున భక్తులు కాలి నడకన గండికి చేరుకున్నారు.ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి కనిపించింది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆర్కే వ్యాలీ సీఐ శంకర్‌రెడ్డి ఎస్‌ఐ శ్రీప్రియ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.కొందరు భక్తులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ అదికారి విశ్వనాథ్‌, చైర్మన్‌ వెంకటస్వామి,పాలక మండలి సభ్యులు పర్యవేక్షించారు.జిల్లా వైద్యారోగ్యశాఖ అదికారి నాగరాజు స్వామిని దర్శించుకున్నారు.అంజన్న మూలవర్లును ఆలయ ప్రధాన ఉపప్రధాన,ముఖ్య అర్చకులు కేసరి,రాజారమేష్‌,రాజగోపాలాచార్యులు రఘు స్వామిలు ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింప చేశాయి. శ్రావణ మాసం తొలిశనివారం ఆలయానికి రు.15,51,669 ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్‌ విశ్వనాథ్‌ తెలిపారు. ప్రసాదాల విక్రయం,సేవాటికెట్లు,అన్నదాన విరాళాలు, తాత్కాలిక అంగళ్లు తాత్కాలిక హుండీల ద్వారా ఈ ఆదాయం వచ్చిందన్నారు.

తొలి శనివారం గండి ఆదాయం

రూ.15 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement