కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచిన ‘1100 కాల్ సెంటర్’ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో మల్లికార్జునుడు కోరారు. ఈ నెల 27వ తేదీన సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో 08562–244437 ల్యాండ్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ప్రజలు తమ సమస్యలను తెలియజేయవచ్చని తెలిపారు.
సేవలపై ప్రజలు స్పందించాలి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని కలెక్టర్ శ్రీధర్ ప్రజలను కోరారు. పీజీఆర్‌ఎస్ కేంద్రాలను సందర్శించే పౌరుల నుంచి అభిప్రాయాన్ని సేకరించేందుకు జిల్లా, మండల స్థాయి పీజీఆర్‌ఎస్ కేంద్రాలలో, వివిధ మాధ్యమాల్లో ప్రజల అభిప్రా య సేకరణకు క్యూఆర్ కోడ్‌ను ప్రద ర్శించాలని నిర్ణయించామన్నారు. పౌరులు పీజీఆర్‌ఎస్ సేవలను పొందిన వెంటనే తమ మొబైల్ ఫోన్‌ల ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చన్నారు. అర్జీల స్థితిగతులు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
ఉత్సాహంగా జిల్లా స్థాయి దివ్యాంగ జట్టు క్రికెట్ ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : అమరావతి ఇన్ క్లూజివ్ క్రికెట్ కప్ – 2026 కోసం నిర్వహించిన జిల్లా స్థాయి దివ్యాంగ క్రికెటర్లు ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడి యం నెట్స్‌లో డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలకు ఉమ్మ డి జిల్లా నుంచి అధిక సంఖ్యలో దివ్యాంగ క్రికెట ర్లు హాజరయ్యారని డీసీఏఏ జిల్లా కన్వీనర్ మనోహర్ రాజు, సిడీసీఏడి అధ్యక్షులు రామాంజనేయులు, ఆర్గనైజర్ సుబ్బయ్య తెలిపారు. అనంతరం నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో క్రీడాకారుల నైపుణ్యం ఆధారంగా జట్టు ఎంపిక ప్రక్రియను నిర్వహించారు.


