వైభవం.. పల్లకీ ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. పల్లకీ ఉత్సవం

Jul 27 2026 1:24 AM | Updated on Jul 27 2026 1:24 AM

రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాకలో ఆదివారం శివ, కేశవులకు పల్లకీసేవ వైభవంగా నిర్వహించారు. రాత్రికి శ్రీ చెన్నకేశవస్వామి హంహవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ సిద్దేశ్వరస్వామి చంద్రప్రభవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తాళ్లపాక టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలాజీ, టీటీడీ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

శివ, కేశువుల కల్యాణానికి ఆర్జిత టికెట్లు జారీ

ఈనెల 30న ఒకే వేదికపై జరిగే శివ, కేశవుల కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు టీటీడీ ఆర్జిత టికెట్లను జారీ చేసినట్లు తాళ్లపాక టెంపుల్‌ ఇన్‌సెక్టర్‌ బాలాజీ తెలిపారు. కళ్యాణోత్సవ టికెట్‌ రూ.300 గా నిర్ణయించారు. వారికే కల్యాణంలో పాల్గొనే అవకాశం కలుగుతుందన్నారు. భక్తులు ముందుగానే రిజర్వేషన్‌ చేసుకోవచ్చునన్నారు. 27వతేదీ 11 గంటలలోపు బుకింగ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement