28న భారీ నిరసన ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

28న భారీ నిరసన ర్యాలీ

Jul 27 2026 1:24 AM | Updated on Jul 27 2026 1:24 AM

మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష, సీఈసీ సభ్యుడు కె.సురేష్‌బాబు

విజయవంతం చేయాలని

యువత, పార్టీ శ్రేణులకు పిలుపు

కడప కార్పొరేషన్‌ : డీఎస్సీ అక్రమాలతో పాటు యువత, విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని నిరసిస్తూ ఈనెల 28వ తేదిన కడపలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, వైఎస్సార్‌ సీపీ సీఈసీ సభ్యుడు కె.సురేష్‌బాబు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం అంజద్‌బాషా కార్యాలయంలో విద్యార్థి, యువజన విభాగ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నీట్‌ అక్రమాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా చేసినట్లుగానే రాష్ట్రంలో డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌ను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దీంతోపాటు రూ. 10 వేల కోట్లకుపైగా పేరుకుపోయి న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి వంటి హామీలు నెరవేర్చకపోవడంపై నిరసన తెలియజేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలతోపాటు విద్యార్థులు, డీఎస్సీ విద్యార్థులు, యువజన సంఘాలతో కలుపుకుని కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు, హాస్టళ్లు, కాలేజీలలో చిన్నచిన్న గ్రూపు మీటింగ్‌ నిర్వహించి వాట్సాప్‌ గ్రూపులు, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు, సోషల్‌మీడియా ద్వారా నిరసన పిలుపు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, రాష్ట్ర కార్యదర్శి షేక్‌ షఫీవుల్లా, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిదత్త, నగర అధ్యక్షుడు శివారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగేంద్రారెడ్డి, వలంటీర్స్‌ విభాగం జోనల్‌ అధ్యక్షుడు అఖిలేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement