కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఉద్యోగులు ఉద్యోగంతోపాటు క్రీడల్లోనూ స్ఫూర్తిని పెంపొందించుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం నగర శివారులోని కెఓఆర్‌ఎం క్రీడా మైదానంలో రాయలసీమ ఎకై ్సజ్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ జోన్‌కి చెందిన ఎక్సైజ్ కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత కోసం ఈ పోటీలను నిర్వహించామన్నారు. ఈ లీగ్ మ్యాచ్‌లో కడప కింగ్స్, చిత్తూరు చీతాస్, కర్నూలు కమాండోస్, అనంతపురం అవెంజర్స్ జట్లు పాల్గొన్నాయి. మొదటి మ్యాచ్‌లో కర్నూల్ కమాండోస్, చిత్తూరు చీతాస్ జట్లు తలపడగా చిత్తూరు జట్టు విజయం సాధించింది. రెండవ మ్యాచ్‌లో కడప కింగ్స్, అనంతపూర్ అవేంజర్స్ జట్లు పోటీ పడగా కడప కింగ్స్ విజయం కై వసం చేసుకుంది. అనంతరం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కడప కింగ్స్, చిత్తూరు చీతాస్ జట్లు పోటీ పడగా, చిత్తూర్ చీతాస్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. అన్ని జట్లు క్రీడాస్ఫూర్తితో ఆడి ప్రేక్షకులను అలరించాయి. అనంతరం విన్నర్‌గా నిలిచిన చిత్తూరు చితాస్ జట్టుకు, రన్నర్‌గా నిలిచిన కడప కింగ్స్ జట్టుకు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్, డిప్యూటీ కమిషనర్ జయరాజు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ అధికారులు విజయ శేఖర్, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసచారి, బాలకృష్ణన్ పాల్గొన్నారు.


