నేటి నుంచి ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఈనెల 24 నుంచి 27 వరకు బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ 2025–26 ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆంధ్ర–సౌరాష్ట్ర జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం జిల్లా క్రికెట్ అసోసియేషన్ స్టేడియాన్ని సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ఇరు జట్లు కడపకు చేరుకోగా మంగళవారం ప్రాక్టీస్ చేశాయి.
జిల్లాలో ఇద్దరు సీఐల బదిలీ
కడప అర్బన్ : కర్నూలు రేంజ్ పరిధిలో 8 మంది సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వైఎస్సార్ కడప జిల్లా కడప నగరంలో టూ టౌన్ సీఐగా నియమితులైన యు. సదాశివయ్యను కడప స్పెషల్ బ్రాంచ్ వన్ సీఐగా బదిలీ చేశారు. గోనెగండ్ల పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేస్తున్న జి.ప్రసాదరావును కడప టూ టౌన్ సీఐగా నియమించారు.
రోడ్డు ప్రమాదంలో
వృద్ధుడికి తీవ్ర గాయాలు
వల్లూరు : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలోని కొప్పోలు బస్టాపు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసింహులు అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. చాపాడు మండలం చీపాడు గ్రామానికి చెందిన నరసింహులు పని మీద మండలంలోని కొప్పోలు గ్రామానికి వచ్చాడు. సాయంత్రం కొప్పోలు బస్టాపు వద్ద రోడ్డు దాటుతుండగా కమలాపురం వైపు నుండి కడప వైపు వెళుతున్న లారీ ఢీ కొట్టింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
వేంపల్లె : భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి క్వాంటం టెక్నాలజీ అవసరమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం మండలంలోని ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో జరిగిన క్వాంటం కంప్యూటర్ వర్క్ షాప్‌లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా విద్యార్థులు సర్టిఫికెట్లను అందజేశారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ క్వాంటం శిక్షణ ద్వారా యంగ్, సెర్చ్ ఫిలోస్ ఇంటర్న్‌షిప్స్ ఇచ్చి భవిష్యత్తు తరాలకు కావలసిన క్వాంటం సాంకేతికతను అందరికి చేరే విధంగా ఉపాధి అవకాశాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్స్ రమేష్ కై లాష్, క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ఇన్‌చార్జి సుధాకర్ రెడ్డి, క్వాంటం టెక్నాలజీస్ కోఆర్డినేటర్ భాస్కరయ్య పాల్గొన్నారు.
సోలార్ కంపెనీలో చోరీ
కొండాపురం : మండల పరిధిలోని సెయిల్ సోలార్ కంపెనీలో సోమవారం రాత్రి సోలార్ కంపెనీలో సుమారు రూ. లక్షలు విలువ చేసే కాపర్ కేబుల్ వైర్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు. ఫోర్ ఎస్కేయు ఎంఎం సోలార్‌కు చెందిన 20,050 వేల మీటర్ల కాపర్ కేబుల్ చోరీకి గురైనట్లు సెక్యూరిటీ ఆఫీసర్ రామిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు చేశారన్నారు.
నేటి నుంచి ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్


