అధికారం అండతో ఆక్రమిస్తే అడ్డుకుంటాం
సాక్షి టాస్క్‌పోర్సు : మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామంలో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించాలని చూస్తే గ్రామమంతా ఏకమై అడ్డుకుంటామని గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు శివవర్దన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోట్లదుర్తి గ్రామంలోని పెద్దమ్మ గుడికి సంబంధించి స్థలం సమస్య చాలా కాలంగా ఉందన్నారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారన్నారు. గ్రామంలోని పెద్దలు కోర్టును ఆశ్రయించారని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న స్థలాన్ని వదిలేసి మిగిలిన స్థలంలో ప్రహరీ నిర్మించమని చెప్పారని తెలిపారు. దీనిపై కూడా కోర్టులో ఫైల్ చేశామన్నారు. కానీ కేసు కోర్టులో ఉండగానే అధికారం ఉందని అధికారులను లొంగదీసుకుని జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారని తెలిపారు. ఈ జంగిల్ క్లియరెన్స్ కూడా ఏ అధికారి లేకుండానే ఇష్ట్రపకారం చేస్తున్నారన్నారు. దీనికి దేవదాయశాఖ అధికారులు సహకరిస్తున్నారని వారు వాపోయారు. దీనిపై అధికారులు తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.


