యురేనియం బాధితుల సమస్యలు పరిష్కరించాలి
కడప సెవెన్‌రోడ్స్ : వేముల మండలంలోని యురేనియం బాధిత గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. మంగళవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితో ఆయన చర్చించారు. ఇటీవల తాను లోక్‌సభలో కూడా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చానన్నారు. యూసీఐఎల్ గత 18 ఏళ్లుగా తుమ్మలపల్లె గ్రామంలో మైనింగ్, ప్రాసెసింగ్ లాంటివి నడుపుతోందని తెలిపారు. తీవ్రమైన రేడియేషన్ ముప్పు ఉంటుందని తెలిసినప్పటికీ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆరు గ్రామాలకు చెందిన ప్రజలు తమ విలువైన భూములను యూసీఐఎల్‌కు ఇచ్చారని తెలిపారు. అయితే యూసీఐఎల్ యాజమాన్యానికి ప్రజల బాధల పట్ల ఏమాత్రం సానుభూతి లేకపోవడం దురదృష్టకరమన్నారు. టెయిలింగ్ పాండ్ వద్ద ప్రమాదకర రసాయనాల వ్యర్థాల గురించి, పునరావాస ప్యాకేజీ అందించడం ద్వారా కొట్టాల గ్రామాన్ని తరలించాల్సిన అవసరం గురించి ఆయన కలెక్టర్‌కు వివరించారు. భూ సేకరణ సమస్యలు, భూములు కోల్పోయిన వారికి ఇవ్వాల్సిన కోటా ఉద్యోగాల కల్పన ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కోరుకొండ–ముద్దనూరు నాలుగు లేన్ల రహదారి వల్ల ఇళ్లు కోల్పోయే వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అనుబంధ సంఘాల నాయకులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, చిన్నప్ప, రుషికేశ్‌రెడ్డి, షఫీవుల్లా, సీహెచ్ వినోద్‌కుమార్, దేవిరెడ్డి ఆదిత్య, యురేనియం బాధిత గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వినతి


