ప్రతిభ చూపితే...భవిత మీదే..! | - | Sakshi
Sakshi News home page

ప్రతిభ చూపితే...భవిత మీదే..!

Aug 7 2025 7:46 AM | Updated on Aug 7 2025 8:14 AM

ప్రతి

ప్రతిభ చూపితే...భవిత మీదే..!

కడప ఎడ్యుకేషన్‌ : విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించేందుకు, వారిలో దాగిన సృజనాత్మక ఆలోచలు, ఆవి ష్కరణల వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి. ఎన్‌సీఈఆర్‌టీ, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ మ్యూజియం, విజ్ఞాన భారతి సంయుక్తంగా విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌(వీవీఎం) పేరుతో జాతీయ స్థాయిలో ప్రతిభాన్వేషణ పరీక్ష నిర్వహిస్తున్నాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియేట్‌ ప్రథ మ సంవత్సరం వరకు చదివే వారికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి భారతదేశ ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌, స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం ఉంటుంది. ఇందుకుగానూ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల పక్రియ ప్రారంభమైంది.

దరఖాస్తుల ఆహ్వానం

విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ ప్రవేశ పరీక్షలో పాల్గొనేందుకు ఆసక్తిగల విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా, సెప్టెంబరు 30వతేదీ వరకు గడువు ఉంటుంది. ఆన్‌లైన్‌ పద్దతిలో పాఠశాల స్థాయిలో పరీక్ష జరుగుతుంది. అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్‌, మొబైల్‌, ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌, డిజిటల్‌ పరికరాలతో ఏదైనా ఒక దాని ద్వారా అప్లికేషన్‌ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని ఇంటి నుంచే పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఈ పోటీపరీక్షను జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో నిర్వహిస్తారు. 6 నుండి 11(ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం)తరగతుల వరకు విడివిడిగా ఈ పరీక్ష ఉంటుంది. విద్యార్థుల ఆసక్తిని బట్టి తెలుగు, హిందీ, ఇంగ్లీషు తదితర భారతీయ భాషల్లో పరీక్ష రాయవచ్చు.

వంద మార్కులకు పరీక్ష

ఈ పరీక్షకు సంబంధించి మాక్‌ పరీక్షలను సెప్టెంబర్‌ 01వ తేదీ నుంచి నిర్వహిస్తారు. పాఠశాల స్థాయి ప్రధాన పరీక్ష అక్టోబరు 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి సెకండ్‌ లెవెల్‌(ద్వితీయ పరీక్ష) పరీక్ష ఆన్‌లైన్‌లో ప్రోక్టరింగ్‌ విధానంలో పరిశీలకుల సమక్షంలో నవంబర్‌ 19వ తేదీన ఉంటుంది. పై రెండు పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య కాలంలో 90 నిమిషాల పాటు(గంటన్నర) రాయాల్సి ఉంటుంది. పరీక్ష రాసే ప్రతి విద్యార్థి ఒకసారి యాప్‌లో లాగిన్‌ అవ్వగలుగుతారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. లెవల్‌–1 ప్రధాన పరీక్షలో ప్రతి తరగతులకు సంబంధించిన వంద ప్రశ్నలుంటాయి. సెక్షన్‌–ఎలో విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ మేధావుల కృషి అంశంపై 20, సత్యేంద్రనాధ్‌ బోస్‌ జీవిత చరిత్రపై 20, సెక్షన్‌–బిలో 6 నుండి 11 తరగతుల విద్యార్థులకు గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుంచి 50, లాజిక్‌, రీజనింగ్‌ నుంచి 10 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఉత్తీర్ణులైన వారికి లెవల్‌ టు (ద్వితీయ పరీక్ష)లో 50 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి.

రాష్ట్ర స్థాయికి ఎంపిక ఇలా....

పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారీగా ప్రతిభ చూపిన మొదటి 25 మందిని ఎంపిక చేస్తారు. 6–11 తరగతులకు గానూ మొత్తం 150 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. అందులో ప్రతిభ చూపిన ప్రతి తరగతి నుంచి ముగ్గురు వంతున మొత్తం 18 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. డిసెంబర్‌ 21 లేదా 28 లేదా జనవరి 4 తేదీల్లో ఏదో ఒక రోజు రాష్ట్ర స్థాయి పరీక్ష రాయాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ప్రతి తరగతి నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ. 5వేలు, రూ. 3వేలు, రూ. 2వేలతో పాటు మెమెంటో, సర్టిఫికేట్‌ అందజేస్తారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి మెమెంటో, ప్రశంసాపత్రం అందజేస్తారు. రాష్ట్రస్థాయి విజేతల్లో ప్రతి తరగతి నుంచి మొదటి ఇద్దరు విద్యార్థుల వంతున 12 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. అకకడ ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థుల వంతున 18 మందిని విజేతలుగా ప్రకటిస్తారు. జాతీయ స్థాయి విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బ హుమతిగా వరుసగా రూ. 25వేలు, రూ.15వేలు, రూ. 10వేలతో పాటు మెమెంటో, ప్రశంసా పత్రంతో పాటు నెలకు 2000 చొప్పున సంవత్సరం పాటు భాస్కర ఉపకార వేతనం అందజేస్తారు. విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ 2025–26లో జాతీయ, జోనల్‌ స్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డీఆర్‌డీవో, ఇస్రో, సీఎస్‌ఐఆర్‌, బీఏఆర్‌సీ మొదలైన ప్రఖ్యాత జాతీయ ప్రయోగశాలలు, పరిశోధన సంస్థల్లో 1–3 వారాల పాటు ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమం నిర్వహిస్తారు.

రిజిస్ట్రేషన్‌ ప్రారంభం : జూన్‌ 1, 2025

మాక్‌ పరీక్షలు : సెప్టెంబర్‌ 1

లెవల్‌ వన్‌ పరీక్ష : అక్టోబరు 28, 29, 30

లెవన్‌ టు పరీక్ష : నవంబర్‌ 7

పరీక్ష సమయం : ఉదయం 10 నుంచి

సాయంత్రం 6 గంటల వరకు

ఫలితాల వెల్లడి : నవంబరు 27

విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌కు

దరఖాస్తుల ఆహ్వానం

6 నుంచి 11వ తరగతి విద్యార్థులకు అవకాశం

ఎంపికై తే స్కాలర్‌షిప్‌, ప్రఖ్యాత

పరిశోధన సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌

సెప్టెంబర్‌ 15 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు తుది గడువు

వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి...

పరీక్ష రాయడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వీవీఎం.ఓఆర్‌జి.ఇన్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వవచ్చు. ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పోటీతత్వాన్ని పెంచుకునేందుకు ఈ పరీక్ష దోహదపడుతుంది.

– ఆర్‌.శ్రీనివాసరెడ్డి, విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ జిల్లా కో ఆర్డినేటర్‌, వైఎస్సార్‌ జిల్లా

సృజనాత్మకతను వెలికి తీసేందుకు...

విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీసేందుకు విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ ఒక చక్కటి వేదికగా నిలుస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సైన్స్‌ పట్ల అభిరుచిని పెంచడం, వారిని శాస్త్రవేత్తలుగా తయారుచేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. ప్రభుత్వ, ఇతర యాజమాన్య ప్రైవేటు పాఠశాలలు కూడా పాల్గొనవచ్చు.

– డివి.సుబ్బానాయుడు, విద్యార్థి విజ్ఞాన్‌

మంథన్‌, జోనల్‌ కో ఆర్డినేటర్‌

హెచ్‌ఎంలు కృషి చేయాలి...

ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు విజ్ఞన్‌ మంఽథన్‌ పరీక్షల్లో పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులతే స్కాలర్‌షిప్‌తోపాటు ప్రఖ్యాత పరిశోధన సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక చొరవ తీసుకుని పిల్లలకు అవగాహన కల్పించాలి.

– షేక్‌ షంషుద్దీన్‌, జిల్లా విద్యాశాఖ అధికారి

ప్రతిభ చూపితే...భవిత మీదే..! 1
1/4

ప్రతిభ చూపితే...భవిత మీదే..!

ప్రతిభ చూపితే...భవిత మీదే..! 2
2/4

ప్రతిభ చూపితే...భవిత మీదే..!

ప్రతిభ చూపితే...భవిత మీదే..! 3
3/4

ప్రతిభ చూపితే...భవిత మీదే..!

ప్రతిభ చూపితే...భవిత మీదే..! 4
4/4

ప్రతిభ చూపితే...భవిత మీదే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement