గాలి గోపురంపై పిడుగు పాటు
వేంపల్లె : స్థానిక పాపాఘ్ని నది ఒడ్డున ఎద్దుల కొండపై ఉన్న శ్రీవృషభాచలేశ్వర స్వామి ఆలయంపై ఉన్న గాలి గోపురంపై పిడుగు పడింది. దీంతో గాలి గోపురం మీద చెక్కిన కళా శిల్పాలు ధ్వంసమయ్యాయి. బుధవారం రాత్రి వేంపల్లెలో ఉరుములు, మెరుపులతో కూడిన గాలి వాన వీచింది. ఎద్దుల కొండపై ఉన్న ఆలయంపై పిడుగు పడటంతో ఆలయంపై ఉన్న విగ్రహాలు పగిలి పోయాయి. గురువారం వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం ఈఓ విశ్వనాథ్ రెడ్డి, దేవస్థానం మాజీ పాలక మండలి సభ్యుడు పీవీ రమణ, పూజారులు హరి, ప్రవీణ్‌లు వెళ్లి దెబ్బతిన్న గాలిగోపురాన్ని పరిశీలించారు.
గాలి గోపురంపై పిడుగు పాటు


