పలువురు దొంగల అరెస్టు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలో 2024 జనవరి నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు వరుస దొంగతనాలకు పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. శనివారం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పులివెందుల, బద్వేలు, కలమల్ల తదితర ప్రాంతాలలో వరుస దొంగతనాలు చేసిన నవీన్, గణేష్, గంగాధర్, రాజశేఖర్, చంద్ర, మహేష్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 300 గ్రాముల వెండి, టీవీతోపాటు ద్విచక్ర వాహనాలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జల్సాలకు, షికార్లకు అలవాటుపడిన ఆరుగురు యువకులు ఇళ్లలో ఎవరూ లేని సమయాల్లో ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేసేవారన్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందం సీఐలు చాంద్ బాషా, వెంకటరమణల ఆధ్వర్యంలో నిఘావేసి బంగారు దొంగలను అరెస్టు చేశారన్నారు. ప్రత్యేక బృందానికి సహకరించిన కానిస్టేబుళ్లు వేణుగోపాల్ రావు, రమేష్, పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు.
ఉగ్రవాదం, మతోన్మాదాలను అరికట్టాలి
కడప సెవెన్‌రోడ్స్ : జమ్ము కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాద మారణ హోమానికి నిరసనగా ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున దేశ సమైక్యతను కాపాడుతామని, ముస్లిం, హిందూ, క్రైస్తవులు భాయి భాయి అని, ఉగ్రవాదాన్ని అరికట్టాలని, దేశ సమైక్యతను కాపాడాలని, ఉగ్రవాదులను అణిచివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం ప్రజా ఐక్యవేదిక నాయకుడు డాక్టర్ రాజా వెంగల్ రెడ్డి మాట్లాడుతూ ర్యాలీలో కులాలు మతాలకు అతీతంగా పాల్గొనడం ప్రజల్లో మతసామరస్యానికి ప్రతిరూపమన్నారు. ఐక్యవేదిక నాయకులు డాక్టర్ ఓబుల్ రెడ్డి, గుజ్జుల ఈశ్వరయ్య, చంద్రశేఖర్, రవిశంకర్ రెడ్డి, బాబు భాయ్, జోగిరామిరెడ్డి, ముక్తియార్ అహ్మద్, రమణ మాట్లాడుతూ కొంతమంది స్వార్థపరులు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశాన్ని
ముక్కలుగా చేయటానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఉగ్రవాదానికి కులం మతం ప్రాంతం ఉండదని, మతోన్మాదానికి కూడా అలాగే కులం మతం ప్రాంతం ఉండదని వారు తెలిపారు. ఈ ఉగ్రవాద దాడికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు చంద్రశేఖర్, లక్ష్మీరాజా, నాగ మునిరెడ్డి, శంకర్, రవికుమార్, నాజర్, రామ్మోహన్, అలీఖాన్, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ అశోక్ కుమార్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఉగ్రవాదులను బహిరంగంగా ఉరి తీయాలి
రాజంపేట టౌన్ : పహల్గాంలో అభంశుభం తెలియని 28 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను బహిరంగంగా ఉరి తీయలాని పట్టణంలోని ముస్లీం మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల ఉన్మాదాన్ని నిరసిస్తూ, ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన వారి ఆత్మశాంతి కోసం శనివారం రాత్రి ముస్లీం మైనార్టీ నాయకులు ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముస్లీం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతి భారతీయుడు అండగా నిలుస్తాడని తెలిపారు.
● రూ.23 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ మురళీ నాయక్
జమ్ము కశ్మీర్ సంఘటనపై ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ
పలువురు దొంగల అరెస్టు


