12వ పీఆర్‌సీ కమిషన్‌ను నియమించాలి
కడప కార్పొరేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం 12వ పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అయినప్పటికీ ఉద్యోగస్థులకు, ఉపాధ్యాయులకు సంబంధించిన 12వ పీఆర్‌సీ కమిషన్‌ను ఇంకా ఏర్పాటు చేయకపోవడం సరికాదని విమర్శించారు. వెంటనే కమిషన్ ఏర్పాటు చేసి, కొత్త పి.ఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆలోపు ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్ ను 25% తగ్గకుండా ప్రకటించాలని కోరారు. ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా వెంటనే విడుదల చేయాలన్నారు. ఎస్.ఎస్.సి. పరీక్షలలో రాష్ట్ర వ్యాప్తంగా సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను తిరిగి విధులలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎవరో చేసిన తప్పులకు ఉపాధ్యా యులను బలి చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం, వల్లూరు, వేంపల్లె (వైఎస్సార్ జిల్లా) ఇతర ప్రాంతాలలో ఎవరో చేసిన తప్పులకు ఉపాధ్యాయులు బలి అయ్యారన్నారు. ప్రభుత్వం అసలైన దోషు లను శిక్షించాలే కాని, ఉపాధ్యాయులను నస్పెండ్ చేసి జైలుకు పంపడం సరియైన పద్ధతి కాదన్నారు. రాబోవు పరీక్షలకై నా ఇలాంటి తప్పిదాలు ఎక్కడా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
పరీక్షల విధుల్లో ఉన్న
ఉపాధ్యాయులను వేధించడం తగదు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
ఎంవీ రామచంద్రారెడ్డి


