●రామగోవిందురెడ్డిని వరించనున్న చైర్మన్‌ పీఠం | - | Sakshi
Sakshi News home page

●రామగోవిందురెడ్డిని వరించనున్న చైర్మన్‌ పీఠం

Mar 27 2025 12:31 AM | Updated on Mar 28 2025 1:23 AM

సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. గురువారం కలెక్టర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ నేతృత్వంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 10గంటలకు నామినేషన్‌ స్వీకరణ, 12గంటలకు నామినేషన్లు పరిశీలన పూర్తి, అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు. 1గంటలకు నామినేషన్‌ ఉపసంహరణ చేపట్టనున్నారు. ఆపై పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ కొనసాగించనున్నారు. జిల్లాలో 50 మంది జెడ్పీటీసీ సభ్యులుండగా వారిలో పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి ఓ ప్రమాదంలో చనిపోయారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతూ రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జెడ్పీకి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో 48 మంది జెడ్పీటీసీ సభ్యులున్నారు. వారిలో గోపవరం మండల జెడ్పీటీసీ జయరామిరెడ్డి మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. మిగతా అందరూ వైఎస్సార్‌సీపీ నుంచి ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులే కావడం విశేషం.

వైఎస్సార్‌సీపీ సభ్యులకు విప్‌ జారీ...

జిల్లా పరిషత్‌లో 47మంది జెడ్పీటీసీలకు వైఎస్సార్‌సీపీ విప్‌ జారీ చేసింది. జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి సూచన మేరకు వేముల జెడ్పీటీసీ బయపురెడ్డి ద్వారా సభ్యులకు విప్‌ జారీ చేశారు. విప్‌ జారీ చేసిన రిసిప్ట్‌ కాపీలు ఎన్నికల అధికారికి అందజేయనున్నారు. విప్‌ అందుకున్న సభ్యులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. విప్‌ ధిక్కరిస్తే ఆయా సభ్యులు సభ్యుత్వం కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం సభ్యులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ముక్తకంఠంతో వెల్లడిస్తున్నారని సమాచారం. దాంతో వైఎస్సార్‌సీపీ ఆత్మవిశ్వాసంతో ఉంది. చైర్మన్‌గిరిని పార్టీ ఖాతాలో జమ చేసుకునేందుకు సన్నద్ధంగా ఉంది.

నేడే ఎన్నిక

ఎన్నికలను నిలిపేయాలంటూ స్టేటస్‌కో కోసం టీడీపీ యత్నం

చైర్మన్‌ ఎన్నికలు నిర్వహించుకోవాలని ఆదేశించిన హైకోర్టు

పోటీలో లేమంటూనే అడ్డగించేప్రక్రియకు ‘పచ్చ’ పన్నాగం

47మంది జెడ్పీటీసీలు వైఎస్సార్‌సీపీ ప్రతినిధులే...విప్‌ జారీ

బ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డికి జెడ్పీ చైర్మన్‌ పీఠం దక్కనుంది. వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా ఆపార్టీ ప్రకటించింది. రెండు పర్యాయాలుగా బి.మఠం జెడ్పీటీసీగా ఆయన ప్రాతినిఽథ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేశారు. అధినేత సూచనలు మేరకు వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు చైర్మన్‌ ఎన్నిక కోసం కంకణబద్ధులై ఉన్నారు. కలిసికట్టుగా ఎన్నిక ప్రక్రియ వ్యవహారం నడిపించేందుకు సన్నాహాలు చేస్తుండడం విశేషం.

●రామగోవిందురెడ్డిని వరించనున్న చైర్మన్‌ పీఠం 1
1/2

●రామగోవిందురెడ్డిని వరించనున్న చైర్మన్‌ పీఠం

●రామగోవిందురెడ్డిని వరించనున్న చైర్మన్‌ పీఠం 2
2/2

●రామగోవిందురెడ్డిని వరించనున్న చైర్మన్‌ పీఠం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement