యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం నిత్య కల్యాణ వేడుక వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించి, గర్భాలయంలో స్వయంభూ మూర్తులను అభిషేకించారు. అనంతరం తులసీ దళాలతో సహస్ర నామార్చన, కుంకుమార్చన పూజలు చేశారు. ఆలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల చెంత అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ప్రథమ ప్రకార మండపంలో భక్తుల మధ్యన శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు జరిపించారు. సాయంత్రం వేళ జోడు సేవలను ఆలయ వీధుల్లో ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు పవళింపు సేవ నిర్వహించారు.
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలి
చౌటుప్పల్ : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం చౌటుప్పల్‌లో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కరువుతో అల్లాడుతున్న మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు ఏదుల నుండే సాగునీరు అందించాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. పంటలకు బీమా వర్తింపజేయాలని తెలిపారు. రైతులు, ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. శివన్నగూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలన్నారు. రాచకొండలో రిజర్వాయర్ నిర్మించి చౌటుప్పల్, నారాయణపురం మండలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు బచ్చనగోని గాలయ్య, పల్లె శేఖర్‌రెడ్డి, నాయకులు మోహన్‌రెడ్డి, రాములు, సుధాకర్, అంజయ్య, భిక్షపతి, మనోహర్, దర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌హెచ్‌ఎంల
సమ్మె విరమణ
భువనగిరి: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్‌హెచ్‌ఎం(జాతీయ ఆరోగ్య మిషన్)లు సమ్మె విరమించారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 371 మంది గత అక్టోబర్‌లో సమ్మెకు దిగిరారు. సుమారు 32 రోజుల పాటు విధులకు దూరంగా ఉండి సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎంలు జేఏసీ నాయకులతో ఈ నెల 14న ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించారు. దీంతో వారు సోమవారం నుంచి విధులకు హాజరుకానున్నారు.
కాంగ్రెస్ పతనం ఖాయం
బొమ్మలరామారం : ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీలన్నింటిని అమలు చేయకపోతే కాంగ్రెస్ పతనం ఖాయమని భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మన్నె శ్రీధర్ అన్నారు. బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామంలో ఆదివారం నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులకు పింఛన్లు మంజూరు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ శ్రీశైలం, తిమ్మాపూర్ సర్పంచ్ కృష్ణానాయక్, మహేందర్ రెడ్డి, మోహన్ నాయక్, వెంకటేష్, మహేష్ గౌడ్ పాల్గొన్నారు.


