మీ టికెట్‌ యాప్‌పై ప్రయాణికులకు అవగాహన | - | Sakshi
Sakshi News home page

మీ టికెట్‌ యాప్‌పై ప్రయాణికులకు అవగాహన

Nov 14 2026 7:57 AM | Updated on Nov 14 2026 7:57 AM

రామగిరి (నల్లగొండ): నల్లగొండ నుంచి హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో ప్రయాణించే నాన్‌స్టాప్‌ బస్సు ప్రయాణికులకు తిప్పలు తప్పనున్నాయి. నల్లగొండ డిపో పరిధిలోని నాన్‌స్టాప్‌ బస్సుల టికెట్లను మీ టికెట్‌ యాప్‌ ద్వారా సులభంగా బుక్‌ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డిప్యూటీ ఆర్‌ఎం ఎన్‌. నరసింహ తెలిపారు. మంగళవారం నల్లగొండ బస్టాండ్‌లో ప్రయాణికులకు యాప్‌ సేవలను వివరించారు. సెప్టెంబరు 2వ తేదీ నుంచి ఈ సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు. బుకింగ్‌ కౌంటర్ల వద్ద నిలబడాల్సిన అవసరం లేకుండా మొబైల్‌ నుంచే క్షణాల్లో టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చన్నారు. బస్సుపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను లేదా లోపల ప్రదర్శించిన కోడ్‌ను స్కాన్‌ చేసి నేరుగా కరెంట్‌ బుకింగ్‌ స్క్రీన్‌కు వెళ్లవచ్చన్నారు. ప్రయాణ వివరాలు నమోదు చేసి చెల్లింపు పూర్తి చేయగానే డిజిటల్‌ టికెట్‌ క్యూఆర్‌ కోడ్‌ రూపంలో వస్తుంది చెప్పారు. దీనిని డ్రైవర్‌ లేదా కండక్టర్‌కు చూపించి ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్‌ మేరీ లావణ్య, సీఐ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement