● దయచేసి వినండి
రామగిరి(నల్లగొండ): తీర్థయాత్రలు చేయాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) నవంబర్ 10 నుంచి డిసెంబర్ 27 వరకు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్ల ద్వారా 4 ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ రైళ్లు ప్రారంభమవుతాయని ఐఆర్‌సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పి.వి. వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్యాకేజీ బ్రోచర్ ఆవిష్కరించారు. ప్రయాణికులకు రైలు/బస్సు ప్రయాణం, హోటల్ వసతి, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, వాటర్ బాటిళ్లు, టూర్ ఎస్కార్ట్, ప్రయాణ బీమా, స్టేషన్ నుంచి ఆలయాలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ప్రతి రైల్వే కోచ్‌కి సెక్యూరిటీ గార్డు, సీసీ కెమెరాల భద్రత ఉంటుందన్నారు.
ప్రత్యేక రైలు ప్యాకేజీల వివరాలు ఇలా..
సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర: నవంబర్ 10 నుంచి 20 వరకు జరిగే ఈ యాత్రలో భాగంగా ఉజ్జయిని, ద్వారక, సోమనాథ్, పూణె, నాసిక్, ఛత్రపతి శంభాజీనగర్‌లో ప్రముఖ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, నాందేడ్ మీదుగా నడుస్తుంది.
దివ్య దక్షిణ యాత్ర: నవంబర్ 23 నుంచి డిసెంబర్ 1 వరకు ఈ యాత్రం ఉంటుంది. తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, చిదంబరం, త్రిచి, తంజావూరు క్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, రేణిగుంట మీదుగా నడుస్తుంది.
అయోధ్య–కాశీ– బైద్యనాథ్ ధామ్ యాత్ర: డిసెంబర్ 5 నుంచి 14 వరకు జరిగే ఈ యాత్రలో పూరి, కోణార్క్, వైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ క్షేత్రాలను దర్శించుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు కాజీపేట, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం మీదుగా నడుస్తుంది.
సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర: డిసెంబర్ 17 నుంచి 27 వరకు మరోసారి ఈ యాత్రకు అవకాశం కల్పిస్తున్నారు.
ఫ జ్యోతిర్లింగాలు, అయోధ్య–కాశీ తదితర క్షేత్రాల సందర్శనకు అవకాశం
ఫ హైదరాబాద్ నుంచి నాలుగు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లు ఏర్పాటు
ఫ నవంబర్ 10 నుంచి డిసెంబర్ 27
వరకు ప్రత్యేక యాత్రలు
విమాన ప్యాకేజీలు ఇవీ..
1. దేశీయ: కశ్మీర్ (డిసెంబర్ 31), అండమాన్ (డిసెంబర్ 2), ఛత్తీస్‌గఢ్ (డిసెంబర్ 2), ఒడిశా (డిసెంబర్ 3), తమిళనాడు (ఫిబ్రవరి 7).
2. అంతర్జాతీయ: శ్రీలంక రామాయణ యాత్ర (డిసెంబర్ 14). టికెట్ బుకింగ్, ప్రయాణ ఛార్జీలు తదితర వివరాలకు www.irctc tourirsm. com వెబ్‌సైట్ లేదా 97013 60701, 92810 30744, 92810 30734, 92810 30727, 92810 30759 నంబర్లను సంప్రదించాలన్నారు.


