భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మండలంలోని దోతిగూడెం పరిధిలో గల వీజె సాయి కెమికల్ కంపెనీని మంగళవారం పీసీబీ, రెవెన్యూ, పరిశ్రమలు, వ్యవసాయ, ఆర్‌డబ్ల్యూఎస్, భూగర్భ జల అధికారుల బృందం తనిఖీ చేసింది. కంపెనీ నుంచి గాలిలో కలిసి వాసన వస్తున్న రసాయనాల నమూనాలు, నీటి నమూనాలను అధికారులు సేకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పి.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు కంపెనీలో అన్ని శాఖల అధికారులు కలిసి తనిఖీలు చేపట్టామన్నారు. ఇక్కడ తీసుకున్న శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపిస్తామని, వచ్చే నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీబీ సైంటిస్ట్ పురుషోత్తంరెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ శంకర్‌బాబా, చౌటుప్పల్ డీఎల్‌పీఓ ప్రతాప్‌నాయక్, ఏఓ శైలజ, పరిశ్రమల శాఖ ఈడీసీ రంజిత్‌కుమార్, ఎంఆర్‌ఐ సుధాకర్‌రావు, పోచంపల్లి, చౌటుప్పల్ మండలాల ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు సాయినాథ్‌రెడ్డి, విశాల్‌రెడ్డి, భూగర్భజలాల శాఖ ఏఈ ఆశ్విత్, అసిస్టెంట్ హైడ్రో జియోలజిస్ట్ ఐశ్వర్య, స్థానికులు ముద్దం సత్యం, గుమ్మి దామోదర్‌రెడ్డి, గుమ్మి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


