ఫార్మర్‌ రిజిస్ట్రీకి రెండు రోజులే.. | - | Sakshi
Sakshi News home page

ఫార్మర్‌ రిజిస్ట్రీకి రెండు రోజులే..

Sep 28 2026 7:33 AM | Updated on Sep 28 2026 7:33 AM

రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

ఆలేరురూరల్‌ : రైతులందరి చేత ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ నెల 22 నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభించింది. ఈ నెల 30వ తేది వరకు గడువు విధించింది. ఉదయం 8 గంటల వరకు వ్యవసాయ అధికారులు గ్రామాలకు చేరుకుని రిజిష్ట్రేషన్‌ చేయించని రైతులను గుర్తించి రిజిస్ట్రీ చేయించనున్నారు. మీసేవ కేంద్రాల్లోనూ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు.

3,00,618 మంది రైతులకు..

కేంద్ర ప్రభుత్వం గతేడాది జనవరిలో ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని 17 మండలాల్లో 3,00,618 రైతులకు గాను 1,99,229 మంది (66 శాతం) ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. మిగతా వారు చేయించుకునేలా ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోని రైతులు ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

పథకాలు పొందాలంటే రిజిస్ట్రేషన్‌

ఐడీ తప్పనిసరి

ఇక నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సబ్పిడీ పథకాలతో పాటుగా యాప్‌ ద్వారా ఎరువులను పొందాలన్నా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ఐడీ తప్పనిసరిగా ఉండాల్సిందే. అదేవిధంగా వానాకాలం, యాసంగి సీజన్లలో పండించిన పంటల అమ్మకాలు, పంట రుణాలను పొందాలన్నా ఫార్మర్‌ ఐడీ తప్పనిసరి. ఇక రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు భరోసా పథకానికి కూడా ఫార్మర్‌ ఐడీని అనుసంధానం చేసే అవకాశం లేకపోలేదు. ఆధార్‌, భూమి పాస్‌బుక్‌, ఆధార్‌ అనుసంధాన ఫోన్‌ నంబర్‌ నమోదు చేపడుతున్నారు. అయితే మూడుసార్లు ఓటీపీ చెబితే 11 అంకెలతో కూడిన విశిష్ట గుర్తింపు సంఖ్య (యూనిక్‌ ఫార్మర్‌ ఐడీ) జనరేట్‌ అవుతుంది. ఈ నంబర్‌తో ప్రభుత్వ పథకాలకు దర ఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇప్పటి వరకు రిజిస్ట్రీ నమోదుకాని రైతులు తప్పకుండా నమోదు చేసుకోవాలి. రైతులు మీసేవ కేంద్రాల్లో లేదా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి వివరాలను నమోదు చేసుకోవచ్చు. నిర్ణీత గుడువులోగా ప్రక్రియ పూర్తి చేస్తాం.

– వెంకటరమణారెడ్డి,

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

ఫ 30 వరకు గడువు విధించిన ప్రభుత్వం

ఫ క్షేత్రస్థాయిలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టిన

వ్యవసాయ శాఖ

ఫ ఏడాదిన్నర గడిచినా 66 శాతమే పూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement