హోటళ్లలో ఆహారం కల్తీమయం | - | Sakshi
Sakshi News home page

హోటళ్లలో ఆహారం కల్తీమయం

Sep 28 2026 7:33 AM | Updated on Sep 28 2026 7:33 AM

ఆత్మకూరు(ఎం): హోటళ్లలో కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. చూడగానే నోరూరించే తినుబండారాలు, ఘుమఘుమలాడే బిర్యానీలను కల్తీ చేస్తున్న హోటళ్ల బాగోతం ఇటీవల అధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది. జిల్లా ఇన్‌చార్జి ఫుడ్‌ సేఫ్టీ అధికారి ఎన్‌.శివశంకర్‌రెడ్డి ఈ నెల 17న ఆత్మకూరు(ఎం), 25న వలిగొండ మండల కేంద్రాల్లోని హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఒక్కో హోటల్‌లో మూడు గంటలకుపైగా జరిపిన సోదాల్లో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. బిర్యానీలో క్యాన్సర్‌ కారకమైన సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ కలుపుతున్నట్లు గుర్తించారు. ఫ్రిజ్‌లలో రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్‌, ఫంగస్‌ (బూజు) సోకిన ఆహార పదార్థాలు, రంగు కలిపిన టీ పొడి, తయారీ తేదీ లేని మిక్చర్‌ ప్యాకెట్లు, కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్‌ను పట్టుకుని ధ్వంసం చేశారు. ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపడంతో పాటు నిబంధనలు పాటించని ఆయా హోటళ్లకు ‘ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసులు’ జారీచేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.

నిబంధనలు బేఖాతరు.. 32 హోటళ్లపై కేసులు

జిల్లావ్యాప్తంగా 470 వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాంటీన్లు ఉండగా.. గతేడాది అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకు అధికారులు 289 హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. 296 ఆహార నమూనాలు సేకరించి, నిబంధనలు ఉల్లంఘించిన 32 హోటళ్లపై కేసులు నమోదు చేశారు.

ఫ ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడిన బాగోతం

ఫ వలిగొండ, ఆత్మకూరు(ఎం)లో

కల్తీ పదార్థాల గుర్తింపు

ఫ బిర్యానీలో క్యాన్సర్‌ కారక

రంగులు కలిపినట్టు నిర్ధారణ

ఫ కల్తీ టీ పొడి, కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్‌, తినుబండారాల పట్టివేత

ఫ ఏడాది కాలంగా 289 చోట్ల తనిఖీలు.. 32 కేసుల నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement