నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లు నిర్వహిస్తున్న వారిపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటాం. పదార్థాలను కల్తీ చేసినా, లైసెన్స్ లేకుండా హోటళ్లు నడిపితే సీజ్ చేస్తాం.
– పి.స్వాతి, జిల్లా డిజిగ్నేటెడ్ అధికారి
ఆత్మకూరు(ఎం)లోని చాలా హోటళ్లు పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్నాయి. నాణ్యతపై ప్రశ్నించే వినియోగదారులను యజమానులు బెదిరిస్తున్నారు. కేవలం ఒకటి రెండు హోటళ్లకే పరిమితం కాకుండా అన్ని హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలి.
– జెట్ట శ్రీనివాస్, సామాజిక
కార్యకర్త, ఆత్మకూరు(ఎం)


