కంటి సమస్యలతో ఎవరూ బాధపడొద్దు | - | Sakshi
Sakshi News home page

కంటి సమస్యలతో ఎవరూ బాధపడొద్దు

Sep 28 2026 7:33 AM | Updated on Sep 28 2026 7:33 AM

సంస్థాన్‌ నారాయణపురం : మునుగోడు నియోజకవర్గంలో కంటి సమస్యలతో ఎవరూ బాధపడొద్దనే ఉద్దేశంతో నా తల్లి సుశీలమ్మ పేరు మీద ఉచిత కంటి వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సంస్థాన్‌ నారాయణపురంలో ఆదివారం ఫీనిక్స్‌ ఫౌండేషన్‌, శంకరా కంటి ఆసుపత్రి సహకారంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 17వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 16 శిబిరాల ద్వారా 12,306 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 2,673 మందికి ఆపరేషన్లు చేయించామని, 5,522 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశామని చెప్పారు. ఈ శిబిరంలో 976 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా..183 మంది ఆపరేషన్లకు ఎంపికయ్యారు. వారిలో 111 మందిని వెంటనే హైదరాబాద్‌లోని శంకరా కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ భోజన సదుపాయం కల్పించి, అందరూ భోజనం చేశారా అని స్వయంగా కనిపించిన ప్రతి ఒక్కరినీ అడగడంతో చాలామంది వృద్ధులు తమను పెద్ద కొడుకు లెక్క ఆప్యాయంగా చూసుకుంటున్నావని చేతులెత్తి నమస్కరించారు. ఈ కార్యక్రమాంలో కుంభం శ్రీనివాస్‌రెడ్డి, గుత్త ఉమాదేవి, ప్రేంచందర్‌రెడ్డి, సర్పంచ్‌లు ఉప్పల విజయలక్ష్మి, గజం అనితసత్యనారాయణ, లోడె రఘు, గడ్డం రవి, శ్రీనివాస్‌, రాజు, ఉప్పల లింగస్వామి, దోనూరి జైపాల్‌రెడ్డి, జక్కలి ఐలయ్యయాదవ్‌, కరెంటోత్‌ భిక్షపతి, మన్నె నర్సిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మాధవరెడ్డి, బాలకృష్ణ, నాగరాజు, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఫ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement