యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.2.59కోట్లు | - | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.2.59కోట్లు

Sep 23 2026 2:12 AM | Updated on Sep 23 2026 2:12 AM

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న నగదు, నగలను మంగళవారం కొండ దిగువన సత్యనారాయణస్వామి వ్రత మండపంలో లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.2,59,03,628 నగదు వచ్చినట్లు యాదగిరిక్షేత్రం కార్యనిర్వహణ అధికారి భవానీ శంకర్‌ వెల్లడించారు. మిశ్రమ బంగారం 32గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోల 950 గ్రాములు వచ్చినట్లు ఆయన వివరించారు. వీటితో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ కూడా వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. ఈ హుండీల ఆదాయం 33 రోజులదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement