చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండల పరిధిలో అదనంగా అండర్‌పాస్‌లు నిర్మించాలని బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్‌హెచ్‌ఏఐ కార్యాలయానికి వెళ్లిన బీజేపీ బృందం హైవే అఽథారిటీ రీజినల్ ఆఫీసర్ శివశంకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలో తంగడపల్లి క్రాస్ రోడ్డు నుంచి వలిగొండ క్రాస్‌రోడ్డు మధ్యన యూపీసీ, వీపీసీ అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఎల్లగిరి గ్రామ స్టేజీ వద్ద మనుషులు, మూగజీవాలు దాటేందుకు పీయూపీ కేటాయించాలన్నారు. అదే విధంగా కొయ్యలగూడెంలో ప్రస్తుతం ఉన్న అండర్‌పాస్ ఇరుకుగా మారినందున అక్కడ అండర్‌పాస్ ఎత్తు, వెడల్పు పెంచి కొత్తగా నిర్మాణం చేయాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న అండర్‌పాస్ నిర్మాణ పనులను మరింత వేగంగా జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దూడల భిక్షం, రమనగోని శంకర్, పోలోజు శ్రీధర్‌బాబు, కది లక్ష్మారెడ్డి, రిక్కల సుధాకర్‌రెడ్డి, కడారి అయిలయ్య, బుడ్డ సురేష్, పోలేపల్లి ముత్తయ్య, చెరుకు శివ, బొడ్డు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


