ఆలేరు స్టడీసెంటర్‌కు పూర్వవైభవం తేవాలి | - | Sakshi
Sakshi News home page

ఆలేరు స్టడీసెంటర్‌కు పూర్వవైభవం తేవాలి

Sep 23 2026 2:12 AM | Updated on Sep 23 2026 2:12 AM

ఆలేరు : అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఆలేరు స్టడీ సెంటర్‌కు పూర్వవైభవం తేవాలని ఓపెన్‌ యూనివర్సిటీ జాయింట్‌ డైరెక్టర్‌(అడ్మిషన్‌ ఇన్‌చార్జి) ప్రొఫెసర్‌ ధర్మానాయక్‌ కోరారు. మంగళవారం ఆయన ఆలేరు స్టడీసెంటర్‌లో కౌన్సిలర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వర్సిటీ టీసీఎస్‌,ఐయాన్‌,వి–హబ్‌, రాశి తదితర సంస్థలతో కుదిరిన ఒప్పందాల ద్వారా విద్యార్థులకు చదువుతోపాటు శిక్షణ, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి,ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. జియో ఫిజిక్స్‌ వంటి కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు పేర్కొన్నారు. ఆలేరు విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ భువనగిరిలో నిర్వహించే అవకాశం కల్పించినట్టు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజారామ్‌, స్టడీ సెంటర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement