ఫ భువనగిరి మున్సిపాలిటీలో రికార్డు స్థాయికి చేరిన నల్లా బకాయిలు
ఫ స్పెషల్ డ్రైవ్ చేపట్టిన అధికారులు
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ పరి ధిలో తాగునీటి (నల్లా) పన్ను బకాయిలు గుదిబండలా మారా యి. అధికా రుల నిర్లక్ష్యం, బకాయిల వసూళ్లలో జాప్యం కారణంగా పాత, కొత్త బకాయిలు కలిపి ఏకంగా రూ. 6.12 కోట్లకు చేరుకున్నాయి. దీంతో అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు.
రూ.11.55లక్షలు మాత్రమే వసూలు
మున్సిపాలిటీ రికార్డుల ప్రకారం పట్టణంలో మొత్తం 10,226 అధికారిక నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 10,098 సాధారణ గృహ కనెక్షన్లు, 128 వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. గతానికి సంబంధించి పాత బకాయిలు ఏకంగా రూ. 4.98 కోట్లు పేరుకుపోగా.. ప్రస్తుత డిమాండ్ రూ. 1.26 కోట్లుగా ఉంది. మొత్తంగా రూ. 6.24 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ. 11.55 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ. 6.12 కోట్లు రావాల్సి ఉంది.. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో బిల్ కలెక్టర్లు ఇంటింటికీ వెళ్లి బకాయిదారులకు నేరుగా డిమాండ్ నోటీసులు అందజేస్తున్నారు.


