భువనగిరిటౌన్ : ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారులు బాధ్యతతో పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. మొత్తం 94 అర్జీలు అందినట్లు తెలిపారు. ప్రజావాణికి ఆరుగురు మున్సిపల్ కమిషనర్లు హాజరు కావాల్సి ఉండగా ఎవరూ రాలేదు. కాగా భువనగిరి మున్సిపాలిటీ నుంచి ఆర్వో హాజరయ్యారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు కృతిక, సాత్విక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ ఇన్‌చార్జ్ కలెక్టర్ భాస్కర్‌రావు


