మన పన్నులు.. మన ఊరికే.. | - | Sakshi
Sakshi News home page

మన పన్నులు.. మన ఊరికే..

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

పల్లెల ప్రగతికి తోడ్పాటు

రామన్నపేట, ఆలేరురూరల్‌ : పన్నుల రూపంలో వసూలు చేసిన నిధులను ఇక నుంచి ట్రెజరీలలో కాకుండా గ్రామ పంచాయతీ సేవింగ్‌ ఖాతాలో జమ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు ఇటీవల చట్టం చేసింది. గ్రామసభల ఆమోదంతో నిధులు డ్రా చేసుకొని అభివృద్ధికి వాడుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరిగే అవకాశం ఉంది.

గతంలో ట్రెజరీల్లో జమ

జిల్లాలోని 17 మండలాల పరిధిలో 427 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు ఇంటిపన్నులు, నల్లా బిల్లులు, మ్యుటేషన్లు, ట్రేడింగ్‌, షాపింగ్‌, తైబజార్‌, లే అవుట్‌, పరిశ్రమలు నుంచి అనేక రకాల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని గతంలో పంచాయతీలు తమకు అవసరమైన సమయంలో వాడుకునే అవకాశం లేకుండా ట్రెజరీల్లో జమ చేయాల్సి ఉండేది. దీంతో వీధిదీపాల నిర్వహణ, పారిశుద్ధ్యం మెరుగునకు, తాగునీటి అవసరాలు తీర్చడం వంటి అవసరాలకు ఉపయోగపడేవి కావు. పల్లెల ప్రగతికి అవరోధంగా మారిన చట్టాన్ని సవరించడం శుభపరిణామం.

గ్రామ సభ నిర్మాణంతో నిధులు ఖర్చు

ప్రభుత్వ ఆదేశాలతో ఇకపై పంచాయతీ సొంత ఆదాయాన్ని ఖజానాలో కాకుండా ఏదేని జాతీయ బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది. అందుకోసం అవసరమైతే పంచాయతీలు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచి పన్నుల రూపంలో వసూలైన ఆదాయాన్ని అందులో జమచేయాలి. ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సకాలంలో విడుదల కాకపోతే జనరల్‌ ఫండ్‌ కింద అత్యవసర పనులు చేసి వెంటనే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇందుకు పంచాయతీలు గ్రామసభ తీర్మానం చేయాల్సి ఉంటుంది. దీంతో గ్రామాల్లో సమస్యలు సత్వర పరిష్కారానికి నోచుకునే అవకాశం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టంలో తీసుకొచ్చిన సవరణ వల్ల పల్లెల ప్రగతికి తోడ్పాటు ఇస్తుంది. ఈ చట్టం ద్వారా మన నిధులను మనమే ఉపయోగించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకునే వీలు ఉంది. పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

– మారెపల్లి మల్లారెడ్డి,

సర్పంచ్‌ కొమ్మాయిగూడెం

ఫ గ్రామ పంచాయతీ సేవింగ్‌ ఖాతాలో జమ చేసుకునే అవకాశం

ఫ పల్లెల్లో వేగవంతం కానున్న అభివృద్ధి పనులు

ఫ జిల్లాలో 427 గ్రామ పంచాయతీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement