న్యూస్‌రీల్
శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం జరుపుకునే మహిళలూ.. మీ ఫొటోలను ‘సాక్షి’ పత్రికలో చూసుకోవాలను కుంటున్నారా.. మీరు పూజలో కూర్చొని, అమ్మవారు కన్పించేలా సెల్ఫీ తీసి ఈ కింది నంబర్‌కు వాట్సప్ చేయండి. శనివారం సంచికలో ప్రచురిస్తాం. సెల్ఫీ ఫొటోతో పాటు మీ పేరు, ఊరు/పట్టణం, మండలం కూడా పంపాలి.
ఆదాయం రూ.3.52 కోట్లు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలు లెక్కించగా రూ.3.52కోట్ల ఆదాయం వచ్చింది.
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2026
- 8లో
సాక్షి, యాదాద్రి: మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు మున్సిపాలిటీల్లో మురుగుకాలువల్లో పూడిక తీయకపోవడం, దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వేయకపోవడం, ఫాగింగ్ చేపట్టకపోవడంతో ఈగలు, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో పట్టణవాసులు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాల బారినపడుతున్నారు.
కాలువల్లో పందుల సంచారం
మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని మురుగు కాలువల్లో పందుల సంచారం పెరిగింది. మోత్కూరు, కొండగడప, ధర్మాపురం, ఆరెగూడెం రాజన్నగూడెం, కొండగడప, జామచెట్లబావి శివారు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మురుగువాసన, రాత్రివేళ దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
సిబ్బంది లేక పక్కన పడేసిన మిషన్లు
యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని కాలనీల డ్రెయినేజీల్లో ఆయిల్ బాల్స్ వేయడంలేదు. మూడు ఫాగింగ్ మిషన్లు ఉన్నప్పటికీ, సిబ్బంది లేక రెండింటిని పక్కన పెట్టారు. ఒక్క ఫాగింగ్ మిషన్‌తో రోజుకో వార్డు చొప్పున మమ అనిపిస్తున్నారు.
పేరుకుపోయిన మురుగు
ఆలేరు మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో డ్రెయినేజీల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. రఘునాథపురం రోడ్డు నుంచి స్థానిక రైల్వే గేట్ వరకు, నూనె మిల్లు నుంచి శివాలయం వరకు కాలువలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ పాఠశాల నుంచి మంతపురి రోడ్డులోని కాలువలో సిల్ట్ పేరుకుపోయి మురుగునీరు వెళ్లడంలేదు. ఫాగింగ్ మిషన్ ఉన్నా వాడటం లేదు.
మా వీధిలో రెండు నెలలుగా ఒక్కసారి కూడా మోరీ తీయడం లేదు. దీనిపై కప్పు లేకపోవడంతో దోమలు కుడుతున్నాయి. దుర్వాసన తో ఇబ్బందులు పడుతున్నాం. రాత్రింబవళ్లు వాటితో భరించలేకపోతున్నాం అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం మోరీలైన శుభ్రపరచాలి.
– తౌవిటి హరినాథ్. హనుమాన్వాడ,
అంగడి బజార్, మోత్కూర్.
కాలనీలో ఫాగింగ్ చేయక చాలా రోజులవుతోంది. దీంతో దోమల సమస్యతో రాత్రిపూట నిద్రపోవడం కష్టంగా మారింది. జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. అధికారులు ఫాగింగ్ చేయాలి. మురుగు కాలువలను శుభ్రం చేయాలి.
– మార్గం వెంకటేష్ ,
ద్వారకా నగర్ కాలనీ –2, ఆలేరు
భువనగిరి రైల్వేస్టేషన్ సమీపంలో మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్త
మున్సిపాలిటీల్లో పడకేసిన పారిశుద్ధ్యం
ఫ విజృంభిస్తున్న దోమలు, ఈగలు
ఫ బ్లీచింగ్ పౌడర్ కరువు
ఫ విషజ్వరాలతో జనం విలవిల


