సాక్షి, యాదాద్రి : నకిలీ వస్త్రాల విక్రయాన్ని అరికట్టేందుకు చేనేత వస్త్రాలకు క్యూ ఆర్ కోడ్ కేటాయిస్తున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.గురువారం కలెక్టరేట్‌లో చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పోచంపల్లి చేనేత వస్త్రాలకు దేశ, విదేశాల్లో గుర్తింపు పెంచడంతో పాటు మార్కెటింగ్ అవకాశాలను మెరుగుపరిచేందుకు ఈ విధానం తీసుకొచ్చినట్లు చెప్పారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా అసలైన చేనేత వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వస్త్రం తయారీ విధానం, దాని ప్రత్యేకతలు, నేయడానికి పట్టిన సమయం, ఆ వస్త్రాన్ని తయారు చేసిన చేనేత కార్మికుడి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు ఎ. శ్రీనివాసరావు, వివిధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
వాణిజ్య పంటలపై దృష్టి సారించాలి
చౌటుప్పల్: రైతులు వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై గురువారం చౌటుప్పల్ మండల పరిధిలోని మసీదుగూడెంలో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ఎల్‌నినో నేపథ్యంలో రైతాంగం నీటి వృథాను అరికట్టాలన్నారు. పంటలు, పంట ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి కర్షకులు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీఎల్పీఓ ప్రతాప్‌నాయక్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారి ముత్యాల నాగరాజు, సర్పంచ్ మర్రి వంశీధర్, ఏఈఓ, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


