నాకున్న 10 ఎకరాలతో పాటు మరో 30 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాను. ఈసారి వర్షాలు లేక నాట్లు ఆలస్యంగా మొదలుపెట్టాను. వారం రోజులుగా సాయంత్రం 4.15 గంటల నుంచి ఉదయం 5 నుంచి 6 గంటల వరకు త్రీఫేజ్ కరెంటు తీసేస్తున్నారు. రోజుకు 10 గంటలు కూడా సక్రమంగా కరెంటు రావడం లేదు. విద్యుత్ సరిపోను సరఫరా కాకపోవడంతో మడులు నానక నాట్లు ఆలస్యం అవుతున్నాయి. మరో 10 ఎకరాలు నాట్లు పెట్టాల్సి ఉండగా కరెంటు కోతల వల్ల నారుమడి నానక ఇబ్బంది పడుతున్నాం.
– నోముల మాధవరెడ్డి, రైతు, ఇంద్రియాల, భూదాన్ పోచంపల్లి మండలం


