నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
భువనగిరి(బీబీనగర్): విద్యార్థులకు నాణ్య మైన విద్యతో పాటు రుచికరమైన ఆహారం, క్రీడా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. శనివారం బీబీనగర్ మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను కలెక్టర్ తనిఖీ చేసి మాట్లాడారు. ఆహార పదార్థాలు నిల్వ ఉంచడంలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామ్‌సుందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి
సాక్షి, యాదాద్రి : ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోఇ అదనపు కలెక్టర్ చాంబర్‌లో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల దష్ట్యా వరికి బదులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. రైతులకు శాసీ్త్రయ సలహాలు అందిస్తూ, పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉద్యానవన శాఖ అధికారిణి హేమలత, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
సగటున 60 మంది కూలీలు వచ్చేలా చూడాలి
గుండాల : ప్రతి గ్రామంలో సగటున 60 కూలీలు వచ్చేలా చూడాలని డీపీఓ కె.శ్రీనివాస్ రెడ్డి సూచించారు.శనివారం గుండాల మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వీబీజీ రామ్‌జీ అధికారులు, వీఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జలసిరిలో ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలను భాగస్వాములను చేసి ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు డీఆర్‌డీఓ జి.సురేష్, డీఎల్‌పీఓ బి.శ్రీకాంత్ రెడ్డి, ఎంపీడీఓ చండీరాణి, ఎంపీఓ రవూఫ్ అలీ, ఏఈలు దామోదర్, భావన, ఏపీఓ ఇమ్మానియల్, ఏపీఎం వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం): రహీంఖాన్‌పేటలో ఐదేళ్లుగా విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సమస్యను పరిష్కరించాలని రైతులు లైన్‌మన్ దృష్టికి తీసుకెళ్లినానిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కర్రనే స్తంభంగా ఏర్పాటు చేసుకున్నారు.


