విద్యార్థులకు నైతిక విలువలు, క్రమశిక్షణ అవసరం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నైతిక విలువలు, క్రమశిక్షణ అవసరం

Jul 20 2026 1:56 AM | Updated on Jul 20 2026 1:56 AM

భూదాన్‌పోచంపల్లి : విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ అవసరమని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య అన్నారు. ఆదివారం పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో నిర్వహించిన ఓరియేంటేషన్‌ డేలో ఆయన పాల్గొని మాట్లాడారు. విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల్లో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంమ, ప్లానింగ్‌, ట్రైనింగ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సీఆర్‌టీ తరగతులు, బోధనా పద్దతులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని అన్నారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో చదువుకున్న 85శాతం విద్యార్థులకు మల్టీనేషనల్‌ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. అధ్యాపకులు సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ విద్యార్థుల సర్వతోముఖావృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. యూన్సివర్సిటీ అడ్వెయిజర్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నిరంతరం నేర్చుకోవాలనే తపన ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ కేవీ కృష్ణకిషోర్‌, రిజిస్ట్రార్‌ పీఎంవీ రావు, యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వైవీ దాసేశ్వర్‌రావు, ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌

లావు రత్తయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement