తప్పనిసరిగా ఈకేవైసీ
చేయించుకోవాలి
భువనగిరి : రేషన్ కార్డుల ఇ–కేవైసీకి పౌరసరఫరాల శాఖ ఈ నెల 31 వరకు తుది గడువు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కార్డులోని సభ్యులంతా తమ పరిధిలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాస్తవానికి రెండున్నరేళ్ల క్రితమే కార్డు కారులందరూ ఇ–కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొన్ని నెలలు వేగంగా కొనసాగి ఆ తర్వాత కాస్త మందగించింది. ప్రస్తుతం నకిలీ కార్డులను ఏరివేయడానికి ఈకేవైసీలో వేగం పెంచారు.
82 శాతం పూర్తి
జిల్లాలో 515 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల పరిధిలో 2,52,187 కార్డులు ఉన్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 2,38,260, అంత్యోదయ కార్డులు 13,727 కార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 82 శాతం ఇ–కేవైసీ ప్రక్రియ పూర్తయింది.
ఇ–కేవైసీకి సూచనలు..
ఫ కార్డుదారులు సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి అక్కడ డీలర్ చెప్పినట్లుగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకుంటే ఇ–కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.
ఫ కార్డులోని ప్రతి సభ్యుడు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ పూర్తి చేయించుకోవాలి.
ఫ ఇ–కేవైసీకి నెలవారి సరుకుల పంపిణీకి ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడైనా వెళ్లి చేయించుకోవచ్చు.
ఫ రేషన్ దుకాణానికి వెళ్లలేని వృద్ధులు కదల్లేనివారు, దివ్యాంగుల మినహాయింపు కోసం రేషన్ డీలర్ లేదా తహసీల్దార్‌ను సంప్రదించాలి.
ఫ బయోమెట్రిక్ వేలిముద్రలు రాకుంటే ఆధార్ సేవలో అప్‌డేట్ చేయించుకోవాలి.
జిల్లాలో రేషన్‌కార్డులకు ఈకేవైసీ పూర్తి చేయించాలని ఆదేశాలు వచ్చాయి. దుకాణాల వారీగా కేఈవైసీ చేయించుకోని వారిని గుర్తించి పూర్తిచేయించాలని తహసీల్దార్లకు సైతం సూచించాం. ఈకేవైసీ చేయించుకోకపోతే భవిష్యత్‌లో రేషన్ కార్డులో పేరు తొలగించబడుతుంది. ఆహార ధాన్యాల కేటాయింపు ఉండదు. కార్డులో పేరున్న వారందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి.
– రోజా, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
ఫ రేషన్ కార్డుదారులకు చివరి అవకాశం
ఫ 31 నాటికి తుది గడువు విధించి
పౌరసరఫరాల శాఖ
ఫ ఇప్పటి వరకు 82 శాతం పూర్తి


