భువనగిరి : బస్వాపురం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేసి ప్రాజెక్టు పరిధిలోని చెరువులను నింపి సాగు నీరు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. బస్వాపురం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి భూ నిర్వాహసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రాజెక్టు కట్టపై చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రైతులకు ఉపయోగపడే బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం నిధుల విడుదలలోనూ ప్రభుత్వం వివక్ష చూపడం తగదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి విడుదల చేయని పక్షంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలరాజు, నాయకులు దయ్యాల నర్సింహ, అంజయ్య, ఈర్లపల్లి ముత్యాలు, అన్నంపల్ల కృష్ణ, కొండ అశోక్, మాతయ్య, ఎల్లయ్య, వెంకటేష్, బాబు, చంద్రయ్య, దేవేందర్ పాల్గొన్నారు.


