గోరింట పండింది | - | Sakshi
Sakshi News home page

గోరింట పండింది

Jul 19 2026 2:14 AM | Updated on Jul 19 2026 2:14 AM

ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి స్నేహితురాళ్లతో కలిసి జరుపుకుంటాం ఎంతో సంతోషంగా ఉంది ప్రకృతి ఇచ్చిన వరం

ఆషాఢంలో మైదాకు పండుగ జరుపుకుంటున్న మహిళలు అందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు

షాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు

గుర్తుకొస్తుంది. ఈ మాసం ముగిసేలోపు మహిళలు

ఒకరోజు గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు. గోరింటాకు పెట్టుకోవడం

కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అదొక పెద్ద

పండుగ. ఇటీవల కాలంలో నగరాల నుంచి పల్లెల వరకు ప్రతి ఇంటా మహిళలు, యువతులు, చిన్న పిల్లలు అనే తేడా లేకుండా అందరూ చేతులకు గోరింటాకు పెట్టుకుంటూ సందడి చేస్తున్నారు.

రామగిరి(నల్లగొండ) : వర్షాకాలం ఆరంభంలో వచ్చే ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక శాసీ్త్రయ, ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రకృతిని ప్రేమిస్తూ, సాంప్రదాయాన్ని గౌరవిస్తూ జరుపుకునే ఈ గోరింటాకు సంబరం ముత్తైదువుల చేతుల్లో ఎర్రటి కాంతులు వెదజల్లుతోంది. మహిళలకు గోరింటాకుకు ఎంతో ప్రత్యేకం. పురాణాల ప్రకారం పడుచమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని చెబుతుంటారు. దీంతో ఈ ఆధునిక యుగంలో సైతం చాలా మంది అమ్మాయిలు ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ ఈ ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఏ ఇంట్లో చూసినా గోరింటాకు సందడే కనిపిస్తుంది.

గోరింటాకును చేతులకు పెట్టుకుంటే శరీరానికి కూడా ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. గోరింటాకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని చాలా పరిశోధనల్లో రుజువైంది. వర్షాకాలంలో ప్రారంభంలో బయటి వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత తగ్గి జ్వరాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. గోరింటాకులోని ప్రత్యేక గుణం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, అందుకే ఈ కాలంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు. వర్షాకాలంలో గోరింటాకు పెట్టుకుంటే చర్మవ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. ఆషాఢంలో వర్షాలు ఎక్కువగా కురవడంతో పంట పొలాలు బురదమయమై క్రిమికీటకాలు పెరుగుతాయి. మహిళలు పొలంలో వరినాట్లు వేయడం వలన చేతులు, కాళ్లకు బురద అంటుకుంటుంది. ఈ మాసంలో మైదాకు పెట్టుకుంటే చర్మవ్యాధులు రాకుండా కాపాడుతుందని వైద్యులు చెబుతున్నారు. మైదాకు వేళ్లకు పెట్టుకోవడం వలన గోళ్లు పెలుసుబారకుండా కాపాడుతుంది. ఆకులే కాకుండా పూలు, వేర్లు, బెరడు, విత్తనాలు కూడా ఔషధ యుక్తాలే. వీటితో శరీరంలో అలర్జీలను దూరం చేసుకోవచ్చు. ఆటలమ్మ మచ్చలు పోగొట్టాలంటే గోరింటాకును బాగా నూరి పూస్తే మంచి ఫలితాన్నిస్తుంది. నెలకోసారి గోరింటాకు ముద్దను తలకు ప్యాక్‌గా వేసుకుంటే జట్టు రాలదు.

ఈ రోజుల్లో గోరింటాకు పెట్టుకోవడం ఒక పెద్ద ఆర్ట్‌ (మెహందీ ఫ్యాషన్‌) అయిపోయింది. కానీ ఆషాఢంలో పెట్టుకోవడం వెనుక ఆరోగ్య సూత్రం ఉంది. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, గోళ్ల వ్యాధులు రాకుండా ఈ గోరింటాకు కాపాడుతుంది. శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం.. అందుకే ఈ పండుగ అంటే నాకు చాలా ఇష్టం.

– సిరా వరుణ

కాలేజీకి సెలవులు ఉన్నా, లేకపోయినా ఆషాఢం రాగానే ఫ్రెండ్స్‌ అందరం ఒకరి ఇంట్లో చేరి చేతులకు గోరింటాకు పెట్టుకుంటాం. ఎవరి చెయ్యి బాగా పండిందోనని పోటీలు పడతాం. ఇదొక మంచి గెట్‌ టుగెదర్‌ లాంటిది. కొత్త కొత్త డిజైన్లు ట్రై చేస్తూ, సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ గడపడం బాగుంటుంది. – చందన

మా చిన్నప్పటి నుంచి ఆషాఢ మాసం వస్తే చాలు.. ఇంట్లో అందరం కూర్చొని గోరింటాకు రుబ్బుకుని పెట్టుకునేవాళ్లం. ఇప్పటి కాలం అమ్మాయిలు కోన్‌ల వైపు మొగ్గు చూపుతున్నా.. మేము మాత్రం చెట్టు ఆకులు కోసుకొచ్చి సాంప్రదాయ పద్ధతిలోనే రుబ్బి పెట్టుకుంటాం. చేతులు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని ఒక నమ్మకం. ఈ పండుగ మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. – ఇందిర

మా చిన్నప్పుడు అమ్మమ్మలు, అమ్మలు చెబుతుండేవారు.. ఆషాఢం వచ్చిందంటే వర్షాలు పడతాయి, వాతావరణం చల్లబడుతుందని, ఈ టైంలో ఒంట్లో వేడి తగ్గడానికి, వర్షాల వల్ల వచ్చే చర్మ వ్యాధులు, గోరుచుట్టు వంటి సమస్యలు రాకుండా ఉండడానికి గోరింటాకు అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని కేవలం సంప్రదాయంగా కాకుండా, సీ్త్రల ఆరోగ్యం కోసం ప్రకృతి ఇచ్చిన ఔషధంగా భావిస్తాను. – తులసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement