ఎల్‌నినో.. ‘ఆయిల్‌ పామ్‌’లో రక్షణ చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో.. ‘ఆయిల్‌ పామ్‌’లో రక్షణ చర్యలు

Jul 19 2026 2:14 AM | Updated on Jul 19 2026 2:14 AM

సూర్యాపేట : ఈ వానాకాలం సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రైతులంతా ఎంతో ఆశతో సాగుచేస్తున్న ఆయిల్‌ పామ్‌ తోటల్లో ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మొక్కల ఆరోగ్యాన్ని, ఉత్పాదకతను కాపాడుకునే అవకాశం ఉంటుందని సూర్యాపేట జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య, సాంకేతిక అధికారి ముత్తినేని మహేష్‌ చెబుతున్నారు. వారు రైతులకు అందిస్తున్న సూచనలు, సలహాలు..

ఎల్‌నినో పరిస్థితుల్లో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. పగటిపూట సాపేక్ష ఆర్ధ్రత తగ్గుతుంది. దీని వల్ల పొడి వాతావర పరిస్థితులు ఏర్పడి ఆయిల్‌ పామ్‌ తోటల్లో గెలలు పూర్తిగా తయారుకావు. మగ పుష్పగుచ్ఛాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మూడేళ్ల కంటే తక్కువ వయస్సున్న ఆయిల్‌ పామ్‌ మొక్కలకు వేరు వ్యవస్థలు ౖపైపెనే ఉంటాయి. కావున పైన మట్టి పొర ఎండిపోవడం వల్ల ఆ వేర్లు ప్రభావితమవుతాయి. పొడి వాతావరణ ఎక్కువ కాలం కొనసాగితే మొక్కల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. అదనపు నీటి పారుదల కొనసాగించకపోతే ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇవి పాటించాలి..

ఫ రక్షణాత్మక నీటిపారుదల, తేమ సంరక్షణ చర్యలు పాటించాలి. క్రమం తప్పకుండా సూక్ష్మ పద్ధతిలో నీటిపారుదల జరిగేలా చూసుకోవాలి. చెట్టు దీర్ఘకాలిక తేమ ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి.

ఫ మొక్క మొదలు చుట్టూ కత్తిరించిన ఆకులు లేదా సేంద్రియ జీవ పదార్థంతో ఒక పొరగా కప్పటం వల్ల నేలలోని తేమ ఆదా అవుతుంది. దీని వలన సూక్ష్మ వాతావరణాన్ని చల్లబర్చి నీటి నష్టాన్ని తగ్గిస్తుందన్నారు.

ఫ అధిక ఉష్ణోగ్రతల ఒత్తిడి ఉన్న కాలంలో తగినంత నీటిపారుదల లేకుండా అధికంగా ఎరువులు వేయకూడదు. నీటి ఒత్తిడిని తట్టుకోవడానికి ప్రతి చెట్టుకు ఇచ్చే సాధారణం కంటే 0.5కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ అదనంగా అందించాలి.

ఫ అధిక ఉష్ణోగ్రతల వల్ల పరాగ సంపర్కం చేయు వివిల్స్‌ మనుగడ, విస్తరణ ప్రతికూలంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇది అంతిమంగా పరాగ సంపర్కం సరిగ్గా జరగకపోవడానికి, ఫలితంగా గెలలు విచ్చిన్నం కావడానికి దారి తీస్తుంది. కొత్తగా ఏర్పాటుచేసిన, ఒంటరి తోటల్లో వీటి స్థిరనివాసం తగ్గే అవకాశం ఉంది. కావున తోటల్లో తేమను పెంచడానికి బిందు సేద్య వ్యవస్థలో అవుట్‌లెట్‌ తెరిచి ఉంచాలి. వేడి ఒత్తిడిని తగ్గించడానికి కోకో, వక్క వంటి అంతర పంటలు వేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement